హీరోయిన్గా మోహన్ లాల్ కూతురు

హీరోయిన్గా మోహన్ లాల్ కూతురు

ఇప్పటికే పలువురు స్టార్ హీరోల కొడుకులు, కూతుర్లు నటవారసులుగా మెప్పిస్తున్న నేపథ్యంలో.. మోహన్ లాల్ కూతురు విస్మయ హీరోయిన్‌‌‌‌‌‌‌‌గా ఎంట్రీ ఇస్తోంది. ఆమె ప్రధానపాత్రలో రూపొందిన సినిమా ‘తుడక్కం’. కేరళ వరదల నేపథ్యంలో ‘2018’ అనే సినిమా చేసి జాతీయ స్థాయిలో మెప్పించిన జూడ్ ఆంటోనీ జోసెఫ్ ఈ చిత్రానికి దర్శకుడు.  ఆంటోని పెరుంబవూర్ నిర్మించారు.  

శుక్రవారం సినిమా విడుదలవుతున్న క్రమంలో ట్రైలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను విడుదల చేశారు. ‘బాగా చదువుకోమని నీకు ఎంతకాలం నుంచి చెబుతున్నా.. ఆ ప్రియను చూడు.. ఏ ఎగ్జామ్ రాసినా మెరిట్ వస్తుంది’ అనే తండ్రి డైలాగ్‌‌‌‌‌‌‌‌తో మిడిల్‌‌‌‌‌‌‌‌ క్లాస్‌‌‌‌‌‌‌‌ ఫ్యామిలీ ఎమోషన్స్‌‌‌‌‌‌‌‌ను చూపించారు. అయితే ఆ తర్వాత కథలో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌‌‌‌‌‌‌‌ చోటు చేసుకున్నాయి.

మొత్తానికి ఫ్యామిలీ ఎమోషన్స్‌‌‌‌‌‌‌‌, యాక్షన్‌‌‌‌‌‌‌‌, థ్రిల్లింగ్‌‌‌‌‌‌‌‌ అంశాలతో కట్ చేసిన ట్రైలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సినిమాపై ఆసక్తి రేపుతోంది.  ట్రైలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చివర్లో పవర్‌‌‌‌‌‌‌‌ఫుల్ లుక్‌‌‌‌‌‌‌‌లో మోహన్ లాల్ గెస్ట్ అప్పియరెన్స్‌‌‌‌‌‌‌‌ ఇవ్వడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ఇక గతంలో ‘గ్రెయిన్స్ ఆఫ్ స్టార్‌‌‌‌‌‌‌‌డస్ట్’ పేరుతో కవితలు, పెయింటింగ్స్‌‌‌‌‌‌‌‌తో కూడిన పుస్తకం రాయడంతోపాటు తన తండ్రి హీరోగా నటించిన ‘బరోజ్‌‌‌‌‌‌‌‌’ చిత్రానికి విస్మయ అసిస్టెంట్‌‌‌‌‌‌‌‌ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా వర్క్ చేసింది. మరోవైపు మోహన్ లాల్ కొడుకు ప్రణవ్‌‌‌‌‌‌‌‌ హీరోగా రాణిస్తున్నాడు.