ఎమర్జెన్సీ నంబర్ డయల్ 112 వ్యవస్థ ప్రత్యేకతలు ఇవే..  

ఎమర్జెన్సీ నంబర్  డయల్ 112 వ్యవస్థ ప్రత్యేకతలు ఇవే..  
  •   ఇకపై జాతీయ ఎమర్జెన్సీ నెంబర్ 
  • ‘112’తోనే పోలీసు, ఫైర్, అంబులెన్స్, విమెన్ ప్రొటెక్షన్, విపత్తు నిర్వహణ సేవలు 
  •      ఏఐతో ఫోన్ కాల్స్ విశ్లేషణ, ఫార్వార్డ్.. ఆటోమేటిక్‌‌‌‌గా వాయిస్ టు టెక్స్ట్ 
  •      కచ్చితమైన లొకేషన్ గుర్తింపు.. ఏరియల్ ఫస్ట్ రెస్పాండర్లుగా డ్రోన్‌‌‌‌ల వాడకం  


హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో అత్యవసర పరిస్థితుల్లో మరింత వేగవంతమైన సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఎమర్జెన్సీ సేవలకు డయల్100 నెంబర్ స్థానంలో ఇకపై ‘నెక్స్ట్-జనరేషన్ డయల్112’ నెంబర్ అత్యవసర సేవలు నిర్వహించనుంది. ఈ మేరకు తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్(ఐసీసీసీ)లో డయల్112 సెంటర్‌‌‌‌ను డీజీపీ సీవీ ఆనంద్ బుధవారం ప్రారంభించారు. కార్యక్రమంలో హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శిఖా గోయల్‌‌, సిటీ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్, సీనియర్ పోలీసు అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీజీపీ సీవీ ఆనంద్ మాట్లాడుతూ.. టెక్నాలజీ ఆధారిత పోలీసింగ్, అత్యవసర సేవల దిశగా తెలంగాణ వేస్తున్న అడుగుల్లో ఈ నెక్స్ట్-జనరేషన్ డయల్112 ప్లాట్‌‌ఫామ్ ఒక ప్రధాన మైలురాయిగా నిలుస్తుందన్నారు. అత్యవసర సమయాల్లో బాధితులకు డయల్112 మొదటి రక్షణ కవచంగా పని చేస్తుందని వెల్లడించారు. ఈ వ్యవస్థ ద్వారా ప్రతి కాల్‌‌ను ఎంత వేగంగా, ప్రొఫెషనల్‌‌గా నిర్వహిస్తామనే దానిపైనే పోలీసు వ్యవస్థపై ప్రజలకు నమ్మకం పెరుగుతుందని పేర్కొన్నారు. 

డయల్112 వ్యవస్థ ప్రత్యేకతలు ఇవే..  

  •   రాష్ట్రంలోని 31 పోలీసు యూనిట్ల పరిధిలో పెట్రోలింగ్ నిర్వహించే 788 కార్లు,1,072 బైకులను డిజిటల్‌‌గా అనుసంధానించారు.
  •   సంఘటన స్థలానికి అత్యంత సమీపంలో ఉన్న వాహనాన్ని సిస్టమ్ ఆటోమేటిక్‌‌గా గుర్తించి పంపుతుంది.
  •   పోలీస్, అగ్నిమాపక, అంబులెన్స్, విమెన్ సేఫ్టీ, శిశు సంక్షేమం, విపత్తు నిర్వహణ సేవలు 
  •   కాల్ ఫిల్టరింగ్: అనవసరమైన, స్పామ్, సైలెంట్, చైల్డ్ కాల్స్‌‌ను ప్రాథమిక స్థాయిలోనే ఫిల్టర్ చేసి, అసలైన అత్యవసర కాల్స్‌‌కు ప్రాధాన్యత ఇస్తుంది.
  •   కాల్ రౌటింగ్, డిస్పాచ్: కాల్ స్వభావాన్ని బట్టి సంబంధిత రెస్పాన్స్ టీమ్‌‌కు ఏఐ టెక్నాలజీ ద్వారా దారి మళ్ళిస్తుంది.
  •   వాయిస్- టు- టెక్స్ట్: మాట్లాడే సంభాషణను ఆటోమేటిక్‌‌ గా టెక్స్ట్ రూపంలోకి మారుస్తుంది.
  •     కచ్చితమైన లొకేషన్ గుర్తింపు: గూగుల్ మ్యాప్స్ ద్వారా ప్రస్తుతం 94 శాతం కాలర్ల లొకేషన్‌‌ను కచ్చితంగా గుర్తిస్తుంది.
  •   డ్రోన్ టెక్నాలజీ: పైలట్ ప్రాజెక్ట్ కింద హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి, ఫ్యూచర్ సిటీ కమిషనరేట్లలో డ్రోన్లను ఏరియల్ ఫస్ట్ రెస్పాండర్లుగా ఉపయోగించనున్నారు.
  •   టెక్నాలజీ మార్పుల వల్ల కాల్ ప్రాసెసింగ్ సమయం గణనీయంగా తగ్గింది. కాల్ టేకర్ సమయం 100 సెకన్ల నుంచి 69 సెకన్లకు.. -డిస్పాచర్ సమయం 90 సెకన్ల నుంచి 64 సెకన్లకు తగ్గింది. -మొత్తం కాల్ సెంటర్ ప్రాసెసింగ్ సమయం190 సెకన్ల నుంచి 133 సెకన్లకు (దాదాపు 30% తగ్గుదల) తగ్గుతుంది. 
  •   ప్రస్తుత రెస్పాన్స్ టైమ్ సగటున -పట్టణ ప్రాంతాల్లో 6 నిమిషాలు కాగా, -గ్రామీణ ప్రాంతాల్లో 15 నిమిషాలుగా ఉంది. -రాష్ట్ర సగటు రెస్పాన్స్ టైమ్ 10 నిమిషాల 30 సెకన్లు (జాతీయ సగటు 18 నిమిషాల కంటే తక్కువ)గా ఉంది. 
  •   ఈ కాల్ సెంటర్ 24x7 ప్రాతిపదికన పని చేస్తుంది. 164 మంది శిక్షణ పొందిన సిబ్బంది -పని చేస్తున్నారు. రోజువారీగా దాదాపు 14 లక్షల కాల్స్ ఐవీఆర్‌‌‌‌ను చేరుతుండగా.. 18,000 ఎమర్జెన్సీ కాల్స్‌‌ను సిబ్బంది స్వీకరిస్తున్నారు. రోజుకు సుమారు 7,500 సంఘటనలకు ఫీల్డ్ 
  • యూనిట్లను పంపుతున్నారు.