PM Modi Football: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పర్యటనల్లో ప్రోటోకాల్ కంటే ఎక్కువగా ప్రజలతో మమేకమయ్యే తీరు ఎప్పుడూ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది. తాజాగా సిక్కిం రాష్ట్ర పర్యటనలో భాగంగా గ్యాంగ్‌టక్ వేదికగా జరిగిన ఒక సంఘటన నెటిజన్ల మనసు గెలుచుకుంటోంది. అక్కడ ఫుట్‌బాల్ ఆడుతున్న చిన్నారులతో కలిసి ప్రధాని మోడీ సరదాగా గడిపిన తీరు ఇప్పుడు నెట్టింట ట్రెండింగ్ టాపిక్ గా మారిపోయింది.
భవిష్యత్తులో మంచి కోచ్ అవుతావు:
సాధారణంగా ప్రధాని మోడీ కనిపిస్తే ఎవరైనా కాస్త తడబడతారు.. కానీ ఆ చిన్నారి మాత్రం ఏకంగా ప్రధానికే మైదానంలో టాక్టికల్ అడ్వైస్ (వ్యూహాలు) ఇవ్వడం మొదలు పెట్టాడు. బంతిని ఎలా పాస్ చేయాలి, ఎక్కడ నిలబడాలి అని ఆ పిల్లాడు ఉత్సాహంగా చెబుతుంటే, పీఎం మోడీ ముసిముసి నవ్వులు చిందించారు. ఆ బాలుడి ఆత్మవిశ్వాసానికి ముగ్ధులైన ప్రధాని, సరదాగా నవ్వుతూ ఇలా అన్నారు.. నువ్వు భవిష్యత్తులో చాలా మంచి కోచ్ అవుతావు అని సూచించారు. ప్రధాని మోడీ తన పర్యటనల్లో కేవలం అభివృద్ధి పనుల గురించి మాత్రమే కాకుండా, ఫిట్ ఇండియా (Fit India), క్రీడల ప్రాముఖ్యతను ఎప్పుడూ నొక్కి చెబుతుంటారు. ఈ ఫుట్‌బాల్ సెషన్ కేవలం ఆట మాత్రమే కాదు, క్రీడలు యువతలో క్రమశిక్షణను, జట్టు స్ఫూర్తిని ఎలా నింపుతాయో చెప్పడానికి ఒక నిదర్శనం అని పేర్కొన్నారు.
నెటిజన్ల రియాక్షన్:
ఈ వీడియో సోషల్ మీడియాలో షేర్ అయిన కొద్దిసేపటికే తెగ వైరల్ గా మారిపోయింది. ప్రధాని మోడీలో కూడా చిన్న పిల్లల మనస్తత్వం కనిపిస్తోంది అని యూజర్ రాసుకొచ్చాడు. ఆ పిల్లాడి కాన్ఫిడెన్స్ మామూలుగా లేదుగా! అని మరొకరు కామెంట్స్ చేస్తున్నారు. హోదా, వయస్సుతో సంబంధం లేకుండా క్రీడలు ఇలా అందరినీ ఒక్కటి చేస్తాయో చెప్పడానికి ఈ వార్మ్ మూమెంట్ ఒక చక్కని ఉదాహరణగా నిలిచింది అంటూ మరో నెటిజన్స్ వ్యాఖ్యనించాడు.
#WATCH | Early morning in Sikkim's Gangtok, PM Narendra Modi joined a group of youngsters for a game of football. pic.twitter.com/fQ2PB9hYDx
— ANI (@ANI) April 28, 2026

