గుజరాత్‌లో జరిగిన స్థానిక ఎన్నికల ఫలితాలు మంగళవారం ( ఏప్రిల్ 28) వెలువడ్డాయి. ఈ ఫలితాల్లో బీజేపీ అన్ని స్థానాలను గెలుచుకుంది. మొత్తం 15 కార్పొరేషన్లు ఉండగా అన్ని కార్పొరేషన్లను బీజేపీ కైవసం చేసుకుంది.తాలూకా పంచాయతీ ఎన్నికల్లో కూడా బీజేపీ హవా కొనసాగింది. అయితే జూనాగఢ్, భేషన్ జిల్లాల్లో స్థానిక సంస్థల ఎన్నికలలో అదృష్టం, అనూహ్య ఫలితం చర్చనీయాంశంగా మారాయి. కేశోద్ మండల పంచాయతీ ఎన్నికల ఫలితాలను ఓ చీటీ ముక్క నిర్ణయించింది. డ్రా ద్వారా విజేతను ప్రకటించారు. మరోవైపు భారీ మెజార్టీతో గెలుస్తానని ధీమా బరిలోకి దిగిన మాజీ ఎమ్మెల్యేకు ఓటర్ల వ్యతిరేకతతో ఘోర ఓటమి పాలయ్యారు. ఆ వివరాలేంటో చూద్దాం..
మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లోజునాగఢ్, భేసన్ జిల్లాలో అదృష్టం, అనూహ్య ఫలితాలతో బీజేపీ, ఆప్ పార్టీలకు చెందిన అభ్యర్థులను కలవర పెట్టాయి. జునాగఢ్ జిల్లాలో కేశోద్ మండల పరిషత్ లోని మోతీ ఘసరి పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ, ఆప్ అభ్యర్థులకు సమానంగా ఫలితాలు రావడంతో సాంప్రదాయ చీటి పద్దతిలో ఫలితాలు ప్రకటించారు. డ్రాద్వారా వెలుబడిన ఫలితాల్లో ఆప్ అభ్యర్థిని అదృష్టం వరించింది.ఈ స్థానంలో బీజేపీ అభ్యర్థికి మంచి పట్టుంది. అయితే ఆప్ అభ్యర్థినే అదృష్టం వరించింది.
మరోవైపు భేషన్ జిల్లా పరిషత్ ఎన్నికల్లో అనూహ్య ఫలితంతో బీజేపీ అభ్యర్థికి చుక్కెదురైంది. గతంలో ఆప్ పార్టీలో ఉన్న స్థానిక నేత మాజీ ఎమ్మెల్యే భూపత్ భయానీ జిల్లా పరిషత్ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూశారు. స్థానికంగా బలమైన నాయకుడు అయిన భయానీ.. జిల్లా పరిషత్ ఎన్నికల్లో తన గెలుపు నల్లేరు మీద నడకే అని ప్రచారం చేసుకున్నారు. దాదాపు విజయం ఖాయమని ధీమాగా ఉన్నారు. అయితే ఓటర్లు భయానీకి దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘోరంగా ఓడించారు. పార్టీ మారడంతో ఓటర్లతో వ్యతిరేకత వచ్చి భయానీ ఓటమిని కారణమయిందని తెలుస్తోంది. ఈ రెండు స్థానాల్లో ఒక చోట అదృష్టం బీజేపీని దెబ్బకొట్టగా.. మరో చోట ఓటర్ల వ్యతిరేకత బీజేపీ అభ్యర్థిని చతికిలా పడేలా చేశాయని స్థానికుల్లో చర్చ మొదలైంది.

