లవ్‍ ఫెయిలైందని.. యువకుడి సూసైడ్

లవ్‍ ఫెయిలైందని.. యువకుడి సూసైడ్

జీడిమెట్ల, వెలుగు: ప్రేమ విఫలమై ఓ యువకుడు ఆత్మహత్యచేసుకున్న సంఘటన జీడిమెట్లలో జరిగింది. సూర్యపేట జిల్లా రాజీవ్ నగర్ కి చెందిన మాధవ్ (25) కుత్బుల్లాపూర్ లో తన అన్న శివకుమార్, తల్లిదండ్రులతో కలిసి కిరాయికి ఉంటున్నాడు. శివకుమార్‍ ఓ అమ్మాయిని ప్రేమించాడు. అతడి ప్రేమను అమ్మాయి ఒప్పుకోకపోవడంతో కొన్ని రోజులుగా మనస్థాపానికి గురవుతున్నాడు. లవ్‍ సక్సెస్‍ కాకపోవడంతో ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో బుధవారం ఉరివేసుకుని చనిపోయాడు. మృతుడి అన్న ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.