ఇవాళ అన్నా డీఎంకే నాయకత్వంపై మద్రాస్ హైకోర్టు కీలక ప్రకటన

ఇవాళ అన్నా డీఎంకే నాయకత్వంపై మద్రాస్ హైకోర్టు కీలక ప్రకటన

తమిళనాడు అన్నా డీఎంకేలో ఆధిపత్య పోరు ముదిరిపోయింది. అన్నా DMK నాయకత్వంపై కాసేపట్లో మద్రాస్ హైకోర్టు కీలక ప్రకటన చేయనుంది. దీంతో పార్టీ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత నెలకొంది. చెన్నైలోని రాయపేట పార్టీ ఆఫీస్ దగ్గర పళనిస్వామి, పన్నీర్ సెల్వం వర్గల కార్యకర్తలు  భారీగా చేరుకుంటున్నారు. పార్టీ ఆఫీస్ దగ్గర OPS, EPS వర్గాల మధ్య ఘర్షణ ఏర్పడింది. తమదే పార్టీ అంటే... తమదే పార్టీ అంటూ రెండు వర్గాలు పెద్దఎత్తున నినాదాలు చేశాయి. 

ఇది కాస్త ముదరటంతో...ఒకరిపై ఒకరు రాళ్లు, కర్రలతో దాడి చేసుకున్నారు. దీంతో ఇరువర్గాలను పోలీసులు చెదరగొట్టారు.  అంతకు ముందే ఇరు వర్గాల ప్రజలు ర్యాలీగా పార్టీ కార్యాలయానికి చేరారు. కోర్టు తీర్పు దృష్ట్యా అన్నా డీఎంకే పార్టీ ఆఫీస్ దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. కార్యకర్తలను అదుపుచేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కోర్టు తీర్పు తర్వాత మహాసభ జరగుతుందా లేదా.. అనేది తేలనుంది.