- మహారాష్ట్రకు చెందిన నోటోరియస్ క్రిమినల్ అరెస్ట్
బేగంబజార్, వెలుగు: జల్సాలకు అలవాటుపడి ఇండ్లలో దొంగతనాలు చేస్తున్న మహారాష్ట్రకు చెందిన నోటోరియస్ క్రిమినల్ అమర్ సింకంబాలే(20)ను బేగంబజార్ పోలీసులు అరెస్ట్ చేశారు. గోల్కొండ జోన్ డీసీపీ చంద్రమోహన్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 6న బేగంబజార్ పరిధిలోని కృష్ణ అనే వ్యక్తి ఇంట్లో తాళాలు పగలగొట్టి 235 గ్రాముల బంగారం, రూ.10 లక్షల నగదు చోరీకి గురైనట్లు ఫిర్యాదు అందింది.
కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా నిందితుడు అమర్ సింకంబాలేను అదుపులోకి తీసుకున్నారు. ఫుట్‌పాత్‌పై ఉంటూ వెయిటర్‌గా పనిచేసే నిందితుడు.. జల్సాల కోసం దొంగతనాలకు పాల్పడుతున్నట్లు విచారణలో తేలింది. గతంలో ఇతనిపై నాలుగు దొంగతనం కేసులతో పాటు ఒక పోక్సో కేసు కూడా నమోదైనట్లు డీసీపీ తెలిపారు. నిందితుడి నుంచి రూ.206 గ్రాముల బంగారం, రూ.2.14 లక్షల నగదు రికవరీ చేసి రిమాండ్‌కు తరలించారు.
