వైరల్ వీడియో : నేను అటు తిరుగుతా.. మీరే నా జేబులో పైసలు పెట్టండి

వైరల్ వీడియో : నేను అటు తిరుగుతా.. మీరే నా జేబులో పైసలు పెట్టండి

పిల్లి పాలు తాగుతూ తనని ఎవరూ చూడడం లేదని అనుకుంటుందంట. అలాగే ఈ మహిళా ట్రాఫిక్ కానిస్టేబుల్ అలాగే అనుకుంది. తనని ఎవరూ చూడడం లేదని అనుకొని ట్రాఫిక్ రూల్స్ పాటించని టూవీలర్ రైడర్స్ దగ్గర డబ్బులు వసూలు చేస్తూ అడ్డంగా దొరికిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

పూణేకి సమీపంలో  పింప్రి – చించువాడ్ అనే ప్రాంతంలో ఓ మహిళా ట్రాఫిక్ కానిస్టేబుల్ విధులు నిర్వహిస్తుంది. విధులు నిర్వహించే సమయంలో ట్రాఫిక్ ఉల్లంఘించిన వాహనదారులకు ట్రాఫిక్ చలాన్లను విధిస్తుండగా.., మరికొంత మంది నుంచి డబ్బులు వసూలు చేసేందుకు ప్రయత్నించింది.

వాహనదారుల నుంచి డబ్బుల్ని చేతులతో తీసుకోకుండా ..నేను అటుతిరుగుతా మీరే నా జేబులో పైసలు పెట్టండి అంటూ సైగలు చేసింది. సైగలతో వాహనదారులు ఆమె జేబులో డబ్బులు పెట్టి అక్కడి నుంచి వెళ్లిపోతున్నారు.

కానిస్టేబుల్ నిర్వాకాన్ని రోడ్డు పక్కనే  బిల్డింగ్ పైన  గుర్తుతెలియని ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ప్రస్తుతం ఆ వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ కాగా.., ఆ వీడియోలపై ట్రాఫిక్ విభాగానికి చెందిన డిప్యూటీ కమీషనర్ సుధీర్ స్పందించారు. ప్రస్తుతం సదరు మహిళా కానిస్టేబుల్ ను విధుల నుంచి సస్పెండ్ చేసినట్లు చెప్పారు. కేసు దర్యాప్తు చేసి చర్యలు తీసుకుంటామన్నారు.