ఫారిన్ చదువులకు పైసలియ్యట్లే!

ఫారిన్ చదువులకు పైసలియ్యట్లే!
  • అమలు కాని సీఎం కేసీఆర్​ హామీ
  • ప్రభుత్వం నుంచి స్కాలర్​షిప్​అందక విదేశాల్లో స్టూడెంట్స్​పరేషాన్​
  • మిత్తికి తెచ్చి పెడుతున్న పేరెంట్స్​

వరంగల్రూరల్, వెలుగుతెలంగాణ నుంచి ఫారిన్‍ పోయే ప్రతి స్టూడెంట్‍కు స్కాలర్‍షిప్‍ ఇస్తం.. ఇంతమంది అంతమంది అని కాకుండా అన్‍ లిమిటెడ్‍ పెడతం.. ఎంతమంది వెళ్లినా పంపిస్తం. ఎన్ని వందల మంది అప్లై చేసినా ఇస్తం.. అసలు రిజక్షన్ అనే మాట ఉండది.. ఎందరు పోదలుచుకున్నా రూ.20 లక్షల చొప్పున ఇస్తం. బీపీఎల్‍ కింద ఉండే దళితులు, మైనార్టీలు, గిరిజనులు, బీసీలతో పాటు అగ్రవర్ణాల్లోని ఈబీసీలకు కూడా ఇస్తం. మన రాష్ట్రంలో తప్పించి ఈ స్కీం ఇండియాలో ఎక్కడా లేదు.

2017 మార్చి 24న అసెంబ్లీలో కేసీఆర్‍ ప్రకటన

మహాత్మా జ్యోతిబా పూలే ఓవర్సీస్‍ విద్యా పథకం కింద ఫారిన్‍ స్టడీస్‍ కోసం పోయిన వందలాది స్టూడెంట్లు పరాయి దేశాల్లో పరేషాన్ అవుతున్నారు. రాష్ట్ర సర్కారు పేద బీసీ స్టూడెంట్లకు స్కాలర్‍షిప్‍ ఇస్తామని చెప్పడంతో 2018లో వందలాది మంది ఆశగా అప్లై చేసుకున్నారు. ఎలాగూ సర్కారు రూ.20 లక్షలు ఇస్తుందనే ఆశతో ముందస్తుగా బ్యాంక్‍ లోన్‍, బయట వడ్డీకి తీసుకొచ్చి ఫ్లైట్​ఎక్కా రు.  తీరా రెండేండ్లు గడిచినా స్కాలర్‍షిప్‍ లేదు. కాలేజీ ఫీజు కట్టలేక అక్కడ స్టూడెంట్లు ఆగమవుతుంటే.. తీసుకొచ్చిన బ్యాంక్‍ లోన్‍ కట్టలేక, ఆర్థిక ఇబ్బందులతో తల్లిదండ్రులు పాట్లు పడుతున్నారు.

నిరుపేద స్టూడెంట్లే ఎక్కువ 

మహాత్మా జ్యోతిబా పూలే బీసీ విదేశీ విద్యానిధి స్కీంలో రిజక్షన్‍ ఉండదని, అర్హులైన ప్రతి పేద బీసీ స్టూడెంట్ అప్లై చేసుకోవచ్చని సీఎం కేసీఆర్‍ స్వయంగా అసెంబ్లీలో చెప్పారు. ఇంజినీరింగ్, సోషల్ సైన్సెస్, మెడికల్​ ఎడ్యుకేషన్​, అగ్రికల్చర్​తదితర  పీజీ కోర్సులు చేసేందుకు ఈ స్కీం కింద పర్మిషన్ ఇచ్చారు. అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, సౌత్ ఆఫ్రికా, సింగపూర్‍ వంటి దేశాల్లో చదువుకోవచ్చు. జనవరి, ఆగస్టు నెలల్లో ఏడాదికి రెండుసార్లు బీసీ సంక్షేమశాఖ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. స్టూడెంట్లు అప్లై చేస్తున్నారు. వారి సామాజిక, ఆర్థిక పరిస్థితులు చూసి స్కాలర్‍షిప్‍ మంజూరు చేస్తున్నారు. ఒకవేళ స్టూడెంట్లు స్టడీస్‍ కోసం అప్పటికే విదేశాలకు వెళ్లిపోతే వారి పేరెంట్స్ ఇంటర్వ్యూలకు హాజరయ్యే చాన్స్​ఇచ్చారు. వీసా పొందినవారికి ఈ అమౌంట్‍ రూ.10 లక్షల చొప్పున రెండు టర్ముల్లో అందిస్తారు. ప్రభుత్వం సపోర్ట్​ చేస్తుందనే నమ్మకంతోనే  వందలాది స్టూడెంట్లు ఫారిన్‍ స్టడీస్‍కు వెళ్లారు.

అందరికి కాదు.. కొందరికే..

ఫారిన్‍ స్టడీస్‍ స్కీంలో భాగంగా రాష్ట్ర సర్కారు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీలకు డిపార్టుమెంట్లవారీగా స్కాలర్‍షిప్‍లు అందిస్తోంది. మహత్మా జ్యోతిబా పూలే ఓవర్సీస్‍ విద్యానిధి పథకంలో 2019–20 లో మొత్తం 848 మంది బీసీలు అప్లై చేసుకోగా 224 రిజక్ట్​ చేశారు. మిగిలిన 624 ఎలిజిబుల్‍ కాగా..సెలక్షన్‍ లిస్టులో  కేవలం 150 మందినే చూపారు. వారికి  కూడా స్కాలర్​షిప్స్​అందకపోవడంతో పరేషాన్​అవుతున్నారు. కొందరికి  మొదటి ఇన్‍స్టాల్‍మెంట్‍ ఇచ్చినా సెకండ్​ ఇన్​స్టాల్​మెంట్​ రాలేదు. ఇంకొందరికి రెండు ఇన్​స్టాల్​మెంట్లూ అందలేదు. దీంతో తల్లిదండ్రులు లక్షల్లో అప్పులు చేసి పంపిస్తున్నారు. కొందరు స్టూడెంట్లు కిందామీదా పడి కోర్సులు పూర్తిచేసినా పూర్తిస్థాయి ఫీజులు చెల్లించకపోవడంతో సర్టిఫికెట్లు రాక ఇబ్బంది పడుతున్నారు.

ఈసారి 285 మందికే ఇస్తారట

ఇన్నాళ్లు ఏడాదికి రెండుసార్లు ఈ స్కీం నడిపిన ప్రభుత్వం 2020–21లో కరోనా పేరుతో నోటిఫికేషన్‍ ఇవ్వనేలేదు. ఆరు నెలలకోసారి అవకాశం కల్పిస్తేనే వెయ్యి మంది వరకు అప్లై చేసుకునేవారు. ఇప్పుడు మధ్యలో రెండు నోటిఫికేషన్లు వేయకపోవడంతో రెండింతలు అప్లై చేసే అవకాశముంది. కాగా, ఈసారి బీసీ ఏ, బీ, సీ, డీ కలిపి 285 మందికి.. మరో 15 మంది ఈబీసీలకు ఇవ్వనున్నట్లు ఆఫీసర్లు చెబుతున్నారు. ఈ లెక్కన సీఎం కేసీఆర్‍ అసెంబ్లీలో చెప్పిన మాటలు అమలయ్యే చాన్స్​ లేనట్లే.

అంత ఫీజు ఎట్ల కట్టాలే

మాది వరంగల్ అర్బన్‍ జిల్లా మట్టెవాడ. నేను ఆటోడ్రైవర్. ప్రభుత్వం పేద స్టూడెంట్లకు ఫారిన్‍ స్టడీ స్కాలర్‍షిప్‍ ఇస్తోందంటే నా కొడుకు అనిల్‍ను ఎంబీఏ చదవడానికి ఆస్ట్రేలియా పంపిన. కొంత బ్యాంక్‍ లోన్‍ తీసుకుని మిగతా అప్పు చేసిన. మధ్యలో నాకు హార్ట్ స్ట్రోక్‍ రావడంతో స్టంట్‍ వేశారు. ఆపరేషన్‍ కోసం ఉన్న సొంతిల్లు అమ్మిన. సర్కారు స్కాలర్‍షిప్‍ ఎప్పుడొస్తుందా అని ఆశతో ఎదురుచూస్తున్నా. ఇప్పుడేమో  కేవలం టాప్ 20  మెరిట్‍ స్టూడెంట్లకు మాత్రమే ఇస్తామని తిరకాసు పెడుతున్నారు. 58 ఏళ్ల వయసులో ఆటో నడుపుడే కష్టంగా ఉంది. ఇప్పుడు స్కాలర్‍షిప్‍ రాకుంటే లక్షల ఫీజులు, ఉన్న అప్పులు కట్టుడు నా వల్లకాదు. సీఎం సార్‍ మమ్మల్ని ఆదుకోవాలె.

– బట్టి పున్నంచంద్, వరంగల్అర్బన్

ఫీజులకు డబ్బుల్లేవ్‍..కెనడాలో జాబుల్లేవ్

తెలంగాణ ప్రభుత్వం ఫారిన్‍ స్టడీస్‍ కోసం మాలాంటి పేదలకు స్కాలర్‍షిప్‍ ఇస్తామని చెప్పడంతో నేను కెనడా మోంట్రియల్‍ కాలేజీ లో 2019 బ్యాచ్‍లో ఎంబీఏ జాయిన్​అయ్యా. స్కాలర్‍షిప్‍ ఇస్తారనే ఆశతో మా నాన్న 12 లక్షలు అప్పు తెచ్చి పంపించిన్రు.  ఆ డబ్బుతో ఫస్ట్​టర్మ్​ ఫీజు కట్టిన. అప్పు వడ్డీతో సహా అలాగే ఉంది. ఇప్పుడు సెకండ్‍ టర్మ్​ ఫీజు అడుగుతున్నరు. ఫ్రీటైంలో ఇక్కడ ఏదైనా జాబ్‍ చేసుకుందామంటే కొవిడ్‍ కారణంగా 8 నెలలుగా స్టోర్స్​ తీయట్లేదు. లివింగ్‍ కాస్ట్​ ఎక్కువ ఉండడం ఇబ్బందిగా ఉంది. మా ఇంటి పరిస్థితి ఏంటో నాకు తెలుసు. స్పెషల్‍ కేటగిరీ కిందైనా మాకు హెల్ప్​ చేయాలని సీఎం సార్‍ను కోరుతున్నా.

-వి.భరత్‍, వరంగల్‍ అర్బన్‍