న్యూఢిల్లీ: వన్డే వరల్డ్‌కప్ తర్వాత క్రికెట్‌కు దూరంగా ఉంటున్న టీమిండియా మాజీ కెప్టెన్ ఎం.ఎస్. ధోనీ ఇప్పట్లో బ్యాట్ పట్టేలా లేడు. గురువారం రాంచీ స్టేడియంలో ప్రాక్టీస్ చేయడంతో మహీ త్వరలోనే బరిలోకి దిగుతాడని ఆశించిన అభిమానులకు మళ్లీ చేదువార్తే. వచ్చే నెలలో వెస్టిండీస్‌తో జరిగే టీ20, వన్డే సిరీస్‌కు కూడా ధోనీ అందుబాటులో ఉండటం లేదని బీసీసీఐ బాంబు పేల్చింది. ఈ మేరకు బోర్డు అధికారి ఈ విషయాన్ని ధ్రువీకరించారు. అయితే మహీ రీ ఎంట్రీ ఇస్తాడా? లేక వీడ్కోలు పలుకుతాడా? అన్న సందేహాలు మొదలయ్యాయి. డిసెంబర్‌లో మొదలయ్యే ఈ టూర్‌లో ఇండియా, విండీస్ మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనున్నాయి.


