తండ్రి బాటలోనే కూతురు.. సితార గొప్ప మనసు.. ఫిదా అవుతున్న నెటిజన్స్

తండ్రి బాటలోనే కూతురు.. సితార గొప్ప మనసు.. ఫిదా అవుతున్న నెటిజన్స్

సూపర్ స్టార్ మహేష్(Mahesh Babu) గారాల పట్టి సితార గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. అయితే ఇప్పుడు ఆమె తన కంటూ సొంత గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవల సితార జ్యువలరీకి బ్రాండ్ అంబాసిడర్ అయ్యారు. ఇక త్వరలో సినిమాల్లోకి కూడా రానుందని తల్లి నమ్రత(Namrata Shirodkar) ఇప్పటికే ప్రకటించారు. 

అయితే తండ్రి నట వారసత్వాని మాత్రమే కాకుండా.. సేవా కార్యక్రమాల్లో కూడా తండ్రి అడుగుజాడల్లోనే నడుస్తున్నారు సితార. చిన్న వయసులోనే వయసులోనే సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ చాలా మందికి మార్గదర్శకంగా నిలుస్తున్నారు సితార. ఇక తాజాగా మరోసారి సితార తన గొప్ప మనసును చాటుకున్నారు. 

రీసెంట్ గా హైదరాబాద్ లోని ఓ మాల్ లో మ్యాక్స్ బ్రాండ్ షోరూం ఓపెన్ అవ్వగా.. ఈ కార్యక్రమానికి గెస్టులుగా నమ్రత శిరోద్కర్ తో పాటు సితార కూడా హాజరయ్యారు. ఆ కార్యక్రమంలో కొంతమంది పేద ముసలి వాళ్లకి..  మ్యాక్స్(MAX) బ్రాండ్ బట్టలు అందచేసింది. అవి సితార చేతుల మీదుగా అందజేశారు. అందులో ఓ పెద్దావిడ స్టేజిపైకి ఎక్కడానికి ఇబ్బందిపడుతుంటే.. సితార కిందకి దిగి స్వయంగా ఆవిడకు చేయి పట్టుకొని పైకి ఎక్కించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చుసిన నెటిజన్స్ తండ్రి మహేష్ బాబులాగే సితార కూడా గొప్ప మనసున్న మనిషి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.