మహేష్ బాబు హోటల్‌లో బిల్లు బాదుడు.. వాటర్ బాటిల్ రూ. 299 చూసి ఫ్యాన్స్ ఫ్యూజులు అవుట్!

మహేష్ బాబు హోటల్‌లో బిల్లు బాదుడు.. వాటర్ బాటిల్ రూ. 299 చూసి ఫ్యాన్స్ ఫ్యూజులు అవుట్!

సినీ ఇండస్ట్రీలో  హీరో, హీరోయిన్లు కేవలం వెండితెరపైనే కాదు, బిజినెస్ ప్రపంచంలోనూ తమ టాలెంట్ చూపిస్తూ దూసుకుపోతున్నారు. థియేటర్లు, రియల్ ఎస్టేట్, క్లాతింగ్ బ్రాండ్స్, హోటల్స్.. ఇలా రకరకాల రంగాల్లో పెట్టుబడులు పెడుతున్నారు. ముఖ్యంగా ఫుడ్ అండ్ రెస్టారెంట్ బిజినెస్ వైపు మన స్టార్ల చూపు ఎక్కువగా ఉంది. ఈ లిస్ట్‌లో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అందరికంటే ముందున్నారు. ఏషియన్ గ్రూప్‌తో కలిసి మల్టీప్లెక్స్ రన్ చేస్తున్న మహేష్.. 'ఏఎన్ ప్యాలెస్ హైట్స్' (AN Palace Heights) పేరుతో లగ్జరీ రెస్టారెంట్ కూడా నడుపుతున్నారు. బంజారాహిల్స్ రోడ్ నెం. 12లో ఉన్న ఈ హోటల్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

వాటర్ బాటిల్ రూ. 299 ! 

ఇటీవల హైదరాబాద్‌కు చెందిన ఓ ఫుడ్ బ్లాగర్ ఈ హోటల్‌కు వెళ్లి, అక్కడి ఎక్స్‌పీరియన్స్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్‌గా షేర్ చేశారు. దీంతో అసలు రచ్చ మొదలైంది.  కారణం.. అక్కడి రేట్లు చూసి జనాలు నోరెళ్లబెడుతున్నారు. సదరు బ్లాగర్ షేర్ చేసిన వీడియో ప్రకారం.. హోటల్ అంబియన్స్ చాలా రాయల్‌గా ఉంది. ఫుడ్ టేస్ట్ కూడా అదిరిపోయింది. కానీ, బిల్లు చూస్తేనే గుండె గుభేల్ అంటోంది. బయట మార్కెట్‌లో రూ. 20 కి దొరికే నార్మల్ వాటర్ బాటిల్ ధర ఈ రెస్టారెంట్‌లో అక్షరాలా రూ. 299! ఇది చూసిన బ్లాగర్.. "ఒక్క వాటర్ బాటిల్‌కు రూ. 299 ఆ? బాబోయ్ మాకొద్దు నాయనా!" అంటూ షాకింగ్ ఎక్స్‌ప్రెషన్ ఇచ్చాడు.

అంతేకాదు, బయట రూ. 40 ఉండే ఒక డైట్ కోక్ క్యాన్ ధర ఇక్కడ రూ. 180 గా ఉంది. ఇక మెనూ విషయానికి వస్తే.. కేవలం ఒక చికెన్ టిక్కా స్టార్టర్ (రూ. 700), ఒక మటన్ బిర్యానీ (రూ. 600) మాత్రమే ఆర్డర్ చేశారు. కానీ చివరికి ట్యాక్స్‌లు, సర్వీస్ ఛార్జీలు అన్ని కలిపి బిల్లు ఏకంగా రూ. 1,853 కి చేరింది! అయితే, రేట్లు భారీగా ఉన్నప్పటికీ.. ఇక్కడి మటన్ బిర్యానీ మాత్రం హైదరాబాద్‌లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ అంటూ బ్లాగర్ తెగ పొగిడేశాడు.

ఆ పైసలతో 2 కేజీల మటన్ వండుకు తింటాం!

ఈ వీడియో కాస్తా వైరల్ అవ్వడంతో సోషల్ మీడియాలో మీమ్స్, కామెంట్ల వర్షం కురుస్తోంది. ముఖ్యంగా ఒక తెలుగు నెటిజన్ పెట్టిన కామెంట్ నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. అంత అమౌంట్ పెట్టి అక్కడ ఒక్క ప్లేట్ బిర్యానీ తినే బదులు.. హ్యాపీగా బయట 2 కేజీల మటన్ తెచ్చుకుని ఇంట్లోనే ఘుమఘుమలాడేలా వండుకుని తింటాం అంటూ క్రేజీ కౌంటర్ ఇచ్చాడు. మరో నెటిజన్.. ఓవర్‌ప్రైస్డ్ రెస్టారెంట్.. కేవలం బ్రాండ్ పేరు చూసి అంత పెట్టలేం అని కామెంట్ చేయగా, కొందరు మాత్రం.. స్టార్ హోటల్స్ అన్నప్పుడు ఆ మాత్రం లగ్జరీ ఛార్జీలు ఉంటాయి బ్రో అంటూ మహేష్ బాబు హోటల్‌కు సపోర్ట్ చేస్తున్నారు.

2023లో ఏషియన్ గ్రూప్ , మహేష్ బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్ (Asian Namrata - AN) కాంబినేషన్‌లో స్టార్ట్ అయిన ఈ హోటల్ సెలబ్రిటీల ఫేవరెట్ స్పాట్. లగ్జరీ ఎక్స్‌పీరియన్స్ ఓకే కానీ, మరీ వాటర్ బాటిల్, సాఫ్ట్ డ్రింక్స్‌కు ఈ రేంజ్‌లో బాదితే సామాన్యుల గుండె ఆగడం ఖాయం అన్న అభిప్రాయాన్ని నెటిజన్లు వ్యక్తం చేస్తున్నారు.