రూ. 5 వేల కోట్లతో మహీంద్రా ఈవీ ప్రాజెక్ట్‌‌లు

రూ. 5 వేల కోట్లతో మహీంద్రా ఈవీ ప్రాజెక్ట్‌‌లు
  • కొత్త ఫైనాన్షియల్​ ఇయర్​లో ఈ‑ఎస్​యూవీ
  • ఆ తరువాత మరో మూడు మోడల్స్​

 
న్యూఢిల్లీ: ఆటోమొబైల్​ కంపెనీ మహీంద్రా అండ్​ మహీంద్రా (ఎం అండ్​ ఎం) ఎలక్ట్రిక్​ వెహికల్స్​ (ఈవీ) తయారీ కోసం పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడానికి రెడీ అయ్యింది. కరెంటు బండ్ల డెవెలప్​మెంట్​ కోసం రాబోయే మూడేళ్లలో రూ.3 వేల కోట్ల నుంచి రూ.5 వేల కోట్ల వరకు  ఖర్చు చేస్తామని ప్రకటించింది. రాబోయే ఆర్థిక సంవత్సరంలో తన మొదటి ఈవీ ఎస్​యూవీ ‘ఎక్స్​యూవీ 400’ను లాంచ్​ చేయనుంది. తన పోర్ట్​ఫోలియోలో ఈవీల సంఖ్యను పెంచనుంది. మూడు కాన్సెప్ట్​ ఈవీ ఎస్​యూవీ మోడళ్ల టీజర్​ వీడియోలను ఇటీవల రిలీజ్​ చేసింది. ఈవీలతోపాటు ఇంటర్నల్​ కంబశ్చన్​ ఇంజన్ల (ఐసీఈ) కోసం క్యాపిటల్​ ఎక్స్​పెండించర్​ రేషియో 50:50గా ఉంటుందని ఈ విషయంతో సంబంధం ఉన్న కంపెనీ వర్గాలు తెలిపాయి. ఈవీల తయారీ కోసం మహీంద్రా 2010 లో రేవా ఎలక్ట్రిక్​ను కొనుగోలు చేసింది. టాటా మోటార్స్, ఎం&ఎం, ఎంజీ మోటార్,  హ్యుందాయ్ మోటార్ వంటి కొన్ని పెద్ద కంపెనీలు కూడా ఈవీ డివిజన్లను ఏర్పాటు చేశాయి. టాటా మోటార్స్  తన ఎలక్ట్రిక్ మొబిలిటీ విభాగానికి.. టాటా ప్యాసింజర్​ ఎలక్ట్రిక్​ మొబిలిటీ లిమిటెడ్ అని పేరు పెట్టింది.  భారతదేశంలో కార్ల ప్లాంట్లను మూసివేస్తామని గత సెప్టెంబర్‌‌‌‌లో ప్రకటించిన ఫోర్డ్ ఇండియా, ఇప్పుడు ప్రధానంగా ఎగుమతులపై దృష్టి సారించింది. ఈవీలను తయారు చేయడానికి తన ప్లాంట్‌‌ను ఉపయోగించాలని భావిస్తోంది. కన్సల్టింగ్ సంస్థ ఎస్​బీఎస్​ రిపోర్టు ప్రకారం, భారతదేశ ఈవీ మార్కెట్ ఈ దశాబ్దంలో 90 శాతం యాన్యువల్​ గ్రోత్‌ రేటుతో 2030 నాటికి  150 బిలియన్ల డాలర్లకు చేరుకుంటుందని అంచనా వేసింది. 2021 ఫైనాన్షియల్​ ఇయర్లో, భారతదేశంలోని మొత్తం వెహికల్​ అమ్మకాల్లో ఈవీల వాటా దాదాపు 1.3 శాతం ఉంది.  

జిప్​జాప్​లో మహీంద్రా లాజిస్టిక్స్​కు వాటా

థర్డ్-పార్టీ లాజిస్టిక్స్ (3పీఎల్​) సొల్యూషన్ ప్రొవైడర్​ మహీంద్రా లాజిస్టిక్స్ లిమిటెడ్ (ఎంఎల్​ఎల్​) లాస్ట్​ మైల్​ లాజిస్టిక్స్ సర్వీస్ ప్రొవైడర్ అయిన జిప్‌‌జాప్ లాజిస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్‌‌లో 60 శాతం వాటాను కొన్నది. ఇందుకోసం దాదాపు రూ.72 కోట్లు చెల్లించింది. ప్రైమరీ , సెకండరీ క్యాపిటల్​తో డీల్​ పూర్తి చేసింది. జిప్‌‌జాప్ లాజిస్టిక్స్ 'విజార్డ్' బ్రాండ్‌‌ పేరిట పనిచేస్తుంది. ఈ కొనుగోలు వల్ల తమ ఎంఎల్​ఎల్ లాస్ట్​-మైల్ డెలివరీ వ్యాపారం, డెలివరీ బిజినెస్  ఈడీఈఎల్​కు ఎంతో మేలు కలుగుతుందని కంపెనీ తెలిపింది. జిప్​జాప్​ ఎలక్ట్రిక్ వెహికల్​ (ఈవీ) ఆధారిత డెలివరీ సేవలనూ అందిస్తుంది. టెక్నాలజీ ఆధారిత లాస్ట్​ మైల్​ సర్వీసులను విస్తరించడం ఎంల్​ఎల్​ గ్రోత్​ స్ట్రాటజీలో భాగమని తెలిపింది. టెక్నాలజీ, జాగ్రఫికల్​ కవరేజీ, ఆపరేషన్​ సామర్థ్యాలను పెంచడానికి ఈ డీల్​ సహాయపడుతుందని ఎంఎల్​ఎల్​ చెబుతోంది.  హైదరాబాద్‌‌కు చెందిన విజార్డ్ డిజిటల్ లాస్ట్​మైల్​ డెలివరీ, డిజిటల్​ కామర్స్​ కోసం ఇంట్రా-సిటీ డిస్ట్రిబ్యూషన్ నెట్‌‌వర్క్‌‌ను నిర్వహిస్తోంది.  సంవత్సరానికి 60 మిలియన్ ప్యాకేజీలను డెలివరీ చేస్తోంది. అంకిత్ మధానియా  అరుణ్ రావు కలిసి స్థాపించిన విజార్డ్ గత మూడు సంవత్సరాల్లో 10 రెట్ల గ్రోత్​ సాధించింది. దాదాపు  3000 పిన్ కోడ్‌‌లలో పూర్తి-స్టాక్  డిజిటల్  కెపాసిటీస్​,  మైక్రో-డిస్ట్రిబ్యూషన్ సెంటర్లతో వినియోగదారులకు సేవలను అందిస్తోంది. ‘‘ఈ అసోసియేషన్ వల్ల ఈ–కామర్స్  ఇతర విభాగాలలో మా కస్టమర్ల సంఖ్య మరింత పెరుగుతుంది. ఇతర సెగ్మెంట్లలోనూ బలపడతాం. విజార్డ్ బృందం డీప్​ కేపబిలిటీస్​ను నిర్మించింది.  ఇప్పటి వరకు బలమైన గ్రోత్​ను అందించింది" అని మహీంద్రా లాజిస్టిక్స్ ఎండీ, సీఈఓ రామ్‌‌ ప్రవీణ్ స్వామినాథన్ అన్నారు.   మహీంద్రా గ్రూప్ మొబిలిటీ సర్వీసెస్ సెక్టార్‌‌లో భాగమైన ఎంఎల్​ఎల్​.. ఆటోమొబైల్, ఇంజనీరింగ్, కన్స్యూమర్ గూడ్స్,  ఈ–కామర్స్ వంటి వివిధ పరిశ్రమలలో 400 మందికి పైగా కార్పొరేట్ క్లయింట్లకు సేవలు అందిస్తోంది.