కాలుష్యం కారణంగా మూతపడ్డ స్కూళ్లు

కాలుష్యం కారణంగా మూతపడ్డ స్కూళ్లు

మలేసియాలో 12 వందలకు పైగా బడులు బంద్ 

కౌలాలంపూర్: మలేసియాలో 12 వందలకుపైగా స్కూళ్లను మూసివేసినట్లు బుధవారం అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. ఇండోనేసియా నుంచి వస్తున్న విషవాయువుల కారణంగా ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. సుమత్రా దీవుల నుంచి మలేసియా పశ్చిమ తీరం వెంబడి, కౌలాలంపూర్ వరకు ఎయిర్ క్వాలిటీ పూర్తిగా తగ్గిపోయినట్లు ఎయిర్ పొల్యూషన్ ఇండెక్స్ లో నమోదైంది. దీంతో  కౌలాలంపూర్​లో 538 స్కూళ్లు, బోర్నియోలో 337 స్కూళ్లను మూసివేశారు. మలేసియాలోని ఇతర రాష్ట్రాల్లో పొల్యూషన్ ప్రభావంతో వందలాది స్కూళ్లు మూసివేసినట్లు ప్రకటించారు. దేశవ్యాప్తంగా 12 వందలకు పైగా స్కూళ్లు మూసివేసినట్లు విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. సింగపూర్ లోనూ గాలి నాణ్యత మరింత పడిపోయినట్లు రికార్డుల్లో వెల్లడైంది. కొద్ది రోజుల్లో జరగాల్సిన ఫార్ములా వన్ రేస్​పై పొగమంచు ఎఫెక్ట్ పడొచ్చని అధికారుల్లో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇండోనేసియాలోని  సుమత్రా, బోర్నియా దీవుల్లో వ్యవసాయం కోసం అడవుల్ని తగలబెట్టడం, చట్ట విరుద్ధంగా ఫ్యాక్టరీలు నడిపించడం లాంటి పనులపై ఎలాంటి కంట్రోల్ లేదు. దీంతో సౌత్​ఈస్ట్ ఆసియా దేశాలైన ఇండోనేసియా, సింగపూర్, మలేసియా ప్రాంతాలపై తీవ్రస్థాయిలో పొల్యూషన్ ఎఫెక్ట్ పడుతోంది. ఈ మంటలతో పొగమంచు ఏర్పడి ఎయిర్ క్వాలిటీ ఏటా తగ్గిపోతోంది.

Malaysia closed more than 1,200 schools