మల్కాజిగిరి, వెలుగు: మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారిపై మల్కాజిగిరి ట్రాఫిక్ పోలీసులు వీకెండ్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. శని, ఆదివారాల్లో జరిపిన తనిఖీల్లో మొత్తం 323 మంది మద్యం బాబులు పట్టుబడగా, వారిలో 267 ద్విచక్ర వాహనాలు, 22 ఆటోలు, 33 కార్లు, ఒక భారీ వాహనం ఉన్నాయి. పట్టుబడిన వారిలో నలుగురు పరిమితికి మించి అత్యంత ప్రమాదకర స్థాయిలో మద్యం సేవించి వాహనాలు నడిపినట్లు పోలీసులు గుర్తించారు.
