హైదరాబాద్ వనస్థలిపురంలో దారుణం జరిగింది. అక్కతో గొడవ పడుతున్నాడని బావను చంపేశాడు ఓ యువకుడు. బుధవారం ( మే 20 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి..వనస్థలిపురం ప్రభుత్వ డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల దగ్గర జరిగింది ఈ దారుణం. హాజీపూర్ కి చెందిన వెంకటేష్ 2015లో స్వప్నను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరు పిల్లలు పుట్టేవరకు సజావుగా సాగిన వారి సంసారంలో ఆ తర్వాత గొడవలు మొదలయ్యాయి.
గొడవల కారణంగా వెంకటేష్ స్వప్నకు దూరంగా ఎస్ఆర్ నగర్ లో ఉంటున్నాడు. మంగళవారం రాత్రి వనస్థలిపురం వచ్చి తన పిల్లలను చూపించాలని భార్యతో గొడవపెట్టుకున్నాడు వెంకటేష్. దీంతో భార్య, ఆమె తమ్ముడు దుబ్బల పాండుతో గొడవకు దిగిన వెంకటేష్. ఈ క్రమంలో వెంకటేష్ పై దాడికి దిగారు స్వప్న, ఆమె తమ్ముడు పాండు. తలపై బలంగా కొట్టడంతో తీవ్ర గాయాలతో పడిపోయాడు వెంకటేష్.
మృతదేహాన్ని 7వ ప్లోర్ నుండి కిందకి దించుతుండగా గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు స్థానికులు.మృతుడి భార్య స్వప్న,బామ్మర్ది పాండు తో పాటు పాండు స్నేహితుడు జగదీష్ అనే యువకుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు పోలీసులు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు పోలీసులు.పాండు భార్యకు అక్రమ సంబంధం ఉన్న క్రమంలో భార్యాభర్తల మధ్య గొడవలు కొనసాగుతున్నట్లు సమాచారం.
