ఇబ్రహీంపట్నంలో దారుణం జరిగింది. బీటెక్ అమ్మాయికి మద్యం తాగించి అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ యువకుడు. మే 14న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి... నల్గొండ జిల్లా నార్కట్ పల్లికి చెందిన ఉడుతల ఉదయ్ కిరణ్ సిద్దార్థ కాలేజీలో బీటెక్ చదువుతున్నాడు. అదే కాలేజీకి చెందిన యువతిని టీ తాగుదామని చెప్పి ఫ్రెండ్ రూమ్ కి తీసుకెళ్లి మద్యం తాగించి అత్యాచారం చేశాడు.
మే 14న రాత్రి 8 గంటల సమయంలో టీ తాగుదామని చెప్పి యువతిని కారులో ఎక్కించుకొని హైదరాబాద్ లోని దిల్షుక్ నగర్ ఏరియాకు తీసుకెళ్లాడు ఉదయ్ కిరణ్. తిరుగు ప్రయాణంలో వైన్ షాపులో వైన్, బ్రీజర్ తీసుకున్న ఉదయ్ కిరణ్ ఇబ్రహీంపట్నంలోని అతడి ఫ్రెండ్ రూమ్ కి యువతిని తీసుకెళ్లాడు. ఆ తర్వాత యువతికి మద్యం తాగించి... మద్యం మత్తులో ఉన్న యువతిపై బలవంతంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది బాధితురాలు.
యువతి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. నిందితుడిని అదుపులోకి తీసుకొని రిమాండ్ కి తరలించారు. యువతిని వైద్య పరీక్షల కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. అమ్మాయిలు అబ్బాయిల పట్ల జాగ్రత్తగా ఉండాలని.. తల్లిదండ్రుల అనుమతి లేనిదే అమ్మాయిలు బయటికి వెళ్లోద్దని సూచిస్తున్నారు పోలీసులు.
ఇబ్రహీంపట్నం పరిసర ప్రాంతాల్లో లాడ్జిల యజమానులు యువతియువకులకు గదులు ఇవ్వొద్దని.. ఇంటి యజమానులు కూడా అనుమతి లేకుండా ఇళ్లలోకి రానివ్వొద్దని సూచిస్తున్నారు పోలీసులు.
