షేక్ పేట్ ల్యాండ్ కేసు: అధికారులపై కేసు పెట్టిన వ్యక్తే కబ్జాకు యత్నం

షేక్ పేట్ ల్యాండ్ కేసు: అధికారులపై కేసు పెట్టిన వ్యక్తే కబ్జాకు యత్నం
  • ఫేక్ డాక్యుమెంట్స్ తో రిజిస్ట్రేషన్ కు యత్నం
  •  ఎమ్మార్వో, ఆర్.ఐ, ఎస్.ఐ లకు రూ. 50 లక్షలు లంచం ఆఫర్
  •  పక్కాప్లాన్ గా అధికారులపై ఏసీబీ ట్రాప్
  •  నిందితుడు ఖలీద్, అతని లీగల్ అడ్వైజర్ అరెస్ట్

షేక్ పేట్ మండల పరిధిలోని బంజారాహిల్స్‌రోడ్‌ నం.14 ల్యాండ్ కేసుకొత్త మలుపు తిరిగింది. తన స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేసేందుకు ఎమ్మార్వో సహా అధికారులు లంచం అడుగుతున్నారని ఏసీబీకి కంప్లైంట్ చేసిన వ్యక్తే సర్కార్ జాగాను కొట్టేసేందుకు ప్లాన్ చేసినట్లు తేలింది. ఫేక్ డాక్యుమెంట్లతో దాదాపు రూ. 40 కోట్ల భూమిని సయ్యద్ అబ్దుల్ ఖలీద్ తో పాటు మరో వ్యక్తి సొంతం చేసుకు నేందుకు ప్రయత్నించినట్లు సీసీఎస్ పోలీసులు తెలిపారు. ప్రధాన నిందితుడు సయ్యద్ అబ్దుల్ ఖలీద్ తో పాటు అతనికి లీగర్ అడ్వయిజర్ గా ఉన్నఅశోక్ రెడ్డిని ఆదివారం అరెస్ట్ చేశారు. కేసు వివరాలను సీసీఎస్ జాయింట్ సీపీ అవినాశ్ మహంతి మీడియాకు వివరించారు. బంజారా హిల్స్‌ రోడ్‌ నం.14 లోని 4,865 స్క్వేర్‌ ‌యార్డ్స్‌ సర్కార్ భూమిని1969లో తన ఫ్యామిలీ మెంబర్స్ పేరు మీద ఉన్నట్లు ఖలీద్ ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేశారని మహంతి చెప్పారు. తండ్రి వారసత్వంగా ఈ భూమి తనకు వచ్చినట్లు పేపర్లు సృష్టించి లీగల్‌ అడ్వయిజర్లు అశోక్‌రెడ్డి తో పాటు మరికొందరితో కలిసి సివిల్‌ కోర్టులో కేసులు వేశాడని ఆ తర్వాత ల్యాండ్‌ను సర్వే చేసి ఆన్‌లైన్‌లో అప్డేట్‌ చేయాలని షేక్‌పేట్‌ తహసీల్దార్‌‌ ఆఫీసులో అప్లయ్ చేశాడని చెప్పారు.

 ప్లాన్డ్ గా పట్టించిండు

ఈ భూమి వ్యవహారంలో లంచం అడుగుతున్నారంటూ షేక్ పేట్ ఎమ్మార్వో సుజాత, ఆర్.ఐ నా గార్డున రెడ్డి, బంజారాహిల్స్ ఎస్. ఐ రవీందర్ పై ఏసీబీ కి ఖలీద్ ఫిర్యాదు చేయటం పక్కా ప్లాన్ గానే చేసినట్లు తెలుస్తోంది. వారితో రూ. 50 లక్షలకు డీల్ సెట్ చేసుకొని వారిపైనే ఏసీబీ కి కంప్లైంట్ చేయటంతో తన భూమి లీగలే అన్నట్లుగా అందరూ భావిస్తారని నిందితుడు అనుకున్నాడు. ఇల్లీగల్ డాక్యుమెంట్స్ అని ముందే పోలీసులకు ఎమ్మార్వో ఇచ్చిన కంప్లైం ట్ ను కూడా ఆమె ఏసీబీకి పట్టుబడటంతో ఎవరు నమ్మరనుకున్నాడు. ఫిర్యాదు తీసుకున్న ఎస్.ఐ కూడా ఏసీబీ కి చిక్కటంతో అంతా కలిసి తప్పుడు కేసు పెట్టారని భావిస్తారని… తన ల్యాండ్ రిజిస్ట్రేషన్ కు ఎలాంటి ఇబ్బంది ఉండదనుకున్నాడు. కానీ సీసీఎస్ పోలీసులు ఎంటరవటంతో మొత్తం సీన్ రివర్స్ అయ్యింది.

ఏసీబీ కంప్లైంట్ తో

అబ్దుల్ ఖలీద్ డాక్యుమెంట్స్ ఇల్లీగల్ అని షేక్ పేట్ ఎమ్మార్వో సుజాత ముందే పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. దీంతో అతనిపై రెండు కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో షేక్ పేట్ ఎమ్మార్వో సహా ఆర్ఐ నాగార్జునరెడ్డి, బంజారాహిల్స్‌ ఎస్ఐ రవీందర్‌‌తో రూ.50 లక్షలకు డీల్ సెట్ చేసుకున్నాడు. వాళ్లకు లంచం ఇచ్చే క్రమంలో ఏసీబీకి కంప్లైంట్ చేశాడు. దీంతో ఆర్ఐ, ఐఎస్కి రూ. 16 లక్షలు లంచం ఇస్తుండగా వారిని ఏసీబీ పట్టుకుంది. ఆ తర్వాత ఎమ్మార్వో సుజాతను కూడా ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. లంచం కేసులో భార్య ఏసీబీకి పట్టుబడిందన్న బాధతో ఎమ్మార్వో సుజాత భర్త జూన్ 17 సూసైడ్ చేసుకున్నారు. ఐతే ఏసీబీకి ఖలీద్ సబ్మిట్ చేసిన డాక్యుమెంట్స్ ఫేక్ అంటూ సికింద్రాబాద్ ఆర్డీవో, ర్డీ షేక్ పేట్ ఎమ్మార్వో లు ఏసీబీకి అధికారులకు తెలిపారు. దీంతో డాక్యుమెంట్లు పరిశీలించిన ఏసీబీ అవి ఫేక్ అన్న అను మానంతో సీసీఎస్ వైట్ కాలర్ అఫెన్స్ వింగ్ కు ఫిర్యాదు చేసింది. దీంతో మొత్తం వ్యవహారం బయటపడింది. ఖలీదు పై ఇప్పటికే నాలుగు ఫోర్జరీ కేసులు ఉన్నట్లు కూడా పోలీసులు గుర్తించారు.