
సిడ్నీ: వన్డే వరల్డ్ కప్ కోసం ఆస్ట్రేలియా ఎంపిక చేసిన 18 మంది సభ్యుల ప్రిలిమినరీ జట్టులో స్టార్ బ్యాటర్ మార్నస్ లబుషేన్‌కు చోటు దక్కలేదు. ఈ ఏడాది ఆరంభంలో ఇండియాలో మూడు వన్డేలు ఆడిన అతను బ్యాటింగ్‌లో ఆకట్టుకున్నాడు.
అన్‌క్యాప్‌డ్ లెగ్ స్పిన్నర్ తన్వీర్ సంగా, ఆల్‌రౌండర్ ఆరోన్ హార్డీని టీమ్‌లోకి తీసుకున్నారు. వరల్డ్ కప్ టైమ్‌కు 15 మందితో కూడిన ఫైనల్ టీమ్‌ను ప్రకటించనున్నారు. యాషెస్ ఐదో టెస్ట్‌లో గాయపడిన కెప్టెన్ కమిన్స్ ఫిట్‌నెస్‌పై కూడా అనుమానాలు నెలకొన్నాయి.
జట్టు: కమిన్స్ (కెప్టెన్), సీన్ అబాట్, ఆస్టన్ ఎగర్, అలెక్స్ క్యారీ, నేథన్ ఎల్లిస్, కామోరున్ గ్రీన్, ఆరోన్ హార్డీ, హాజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మిచెల్ మార్ష్, మ్యాక్స్‌వెల్, తన్వీర్ సంగా, స్మిత్, స్టార్క్, స్టోయినిస్, వార్నర్, జంపా.