రోహిత్‌తో బెడ్‌రూమ్ సీక్రెట్స్: బిగ్‌బాస్ నటి షాకింగ్ కామెంట్స్.. హిట్‌మాన్ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం! 

రోహిత్‌తో బెడ్‌రూమ్ సీక్రెట్స్: బిగ్‌బాస్ నటి షాకింగ్ కామెంట్స్.. హిట్‌మాన్ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం! 

Rohit Sharma : టీమిండియా మాజీ కెప్టెన్, భారత క్రికెట్ దిగ్గజం రోహిత్ శర్మ పేరును వాడుకుంటూ బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్, బ్రిటీష్ మోడల్ సోఫియా హయాత్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. తన కొత్త పాడ్‌కాస్ట్ ప్రమోషన్ కోసం ఏకంగా హిట్‌మాన్ రోహిత్ వ్యక్తిగత జీవితంపై అసహ్యకరమైన కామెంట్లు చేస్తూ గ్లోబల్ వైడ్ లో ఉన్న క్రీడా అభిమానుల నుంచి తీవ్ర నిరసనను ఎదుర్కొంటోంది.

బెడ్‌రూమ్ సీక్రెట్స్ బయటపెట్టింది: 

స్ట్రైట్ టాక్ క్వీర్ విస్డమ్ అనే పాడ్‌కాస్ట్ షోలో పాల్గొన్న  సోఫియా హయాత్, గతంలో రోహిత్‌తో తనకు అఫైర్‌ ఉన్నట్లు చెప్పుకొచ్చింది. సోషల్ మీడియా వేదికగా ఆ ప్రోమో క్లిప్‌ను షేర్ చేస్తూ.. రోహిత్‌కు నేనే తొలి పరిచయాన్ని. పురుషులకు బెడ్‌రూమ్‌లో ఎలా ప్రవర్తించాలో ఎవరో ఒకరు నేర్పించాలి.. అది ఏమీ పరుగు పందెం (స్ప్రింట్) కాదు.. నా లైఫ్ రహస్యాలు తెలుసుకోవడానికి ఈ షో చూడండి అంటూ కాంట్రవర్సీ క్యాప్షన్ జోడించింది. తన పాడ్‌కాస్ట్ వ్యూస్ కోసం రోహిత్ శర్మ వ్యక్తిత్వాన్ని దిగజార్చేలా చేసిన ఈ పోస్ట్ క్రికెట్ ప్రపంచంలో తీవ్ర దుమారం రేపుతుంది. 

2022లో నీతులు.. ఇప్పుడు యూ-టర్న్: 

2022లో ఇదే సోఫియా హయాత్ సోషల్ మీడియా వేదికగా మాట్లాడుతూ.. దయచేసి రోహిత్ శర్మను నా పేరుతో ముడిపెట్టడం ఆపేయండి.. అతనికి పెళ్లయి ఒక పాప కూడా ఉంది.. అతని వైవాహిక జీవితానికి గౌరవం ఇవ్వండి అని వేడుకుంది. గతంలో గౌరవం గురించి నీతులు చెప్పిన ఈ బిగ్ బాస్ నటి, ఇప్పుడు తన కొత్త షో పబ్లిసిటీ కోసం ఉన్నపలంగా మాట మార్చి రోహిత్ పేరును వాడుకోవడంపై రోహిత్ ఫ్యాన్స్ తీవ్రంగా మండిపడుతున్నారు.  

ALSO READ : ఇదే నా చివరి వరల్డ్ కప్.. ఫోన్ చేసి ఆశలు రేపి మోసం చేశారు

హిట్‌మాన్ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం: 

రోహిత్ శర్మ ఇమేజ్‌ను దెబ్బతీసేందుకు, చవకబారు వ్యాఖ్యలతో లైమ్‌లైట్‌లోకి వచ్చేందుకు సోఫియా హయాత్ ప్రయత్నిస్తోందని ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఆమెపై విరుచుకుపడుతున్నారు. పరిశ్రమలోకి వచ్చిన కొత్తలో అవకాశాల కోసం తన వయస్సుపై కూడా అబద్ధాలు చెప్పానని ఒప్పుకున్న నటిని నమ్మాల్సిన అవసరం లేదని, క్రేజ్ కోసం జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న క్రీడాకారుడిపై ఇలాంటి నిందలు వేయడం సిగ్గుచేటని నెటిజన్లు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు.