- పోలీసుల అదుపులో 11 మంది
ఉప్పల్, వెలుగు : నాచారంలోని పాయస్ డిగ్రీ కాలేజీలో ఆదివారం నిర్వహించిన ఐఐసీటీ ఎంటీఎస్ (మల్టీ టాస్కింగ్ స్టాఫ్) పరీక్షలో మాస్ కాపీయింగ్ కలకలం రేపింది. గతంలో ట్రేడ్ టెస్టులో అర్హత సాధించిన అభ్యర్థుల కోసం ఈ ఎగ్జామ్ నిర్వహించగా, కొంతమంది లేటెస్ట్ టెక్నాలజీ, మైక్రో చిప్‌ల ద్వారా కాపీయింగ్‌కు పాల్పడ్డారనే నమ్మదగిన సమాచారంతో నాచారం పోలీసులు రంగంలోకి దిగారు.
ఈ క్రమంలో నార్త్ ఇండియాకు చెందిన 11 మంది అభ్యర్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. అయితే, మైక్రో చిప్‌లు దొరికాయనేది కేవలం పుకార్లేనని, సాంకేతిక పరికరాలు లభించాయన్న వార్తల్లో నిజం లేదని పోలీసులు కొట్టిపారేశారు. ప్రస్తుతం అదుపులోకి తీసుకున్న అనుమానిత అభ్యర్థులను స్టేషన్‌కు తరలించి పూర్తి స్థాయిలో విచారిస్తున్నామని పోలీసులు వెల్లడించారు.
