సికింద్రాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. 2026 మే 16న ఉదయం రెజిమెంటల్ బజార్ లో జరిగిన ప్రమాదం స్థానికులను భయాందోళనలకు గురిచేసింది. మెట్రో పోలీస్ భవనంలోని మూడవ అంతస్తులో ఉన్న రెస్టారెంట్ లో భారీ ఎత్తున మంటలు చెలరేగాయి.
తెల్లవారుజామున 5 గంటల సమయంలో అగ్నిప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో రెస్టారెంట్ పక్కనే ఉన్న హోటల్లో 67 మంది ఉన్నట్లు పోలీసులు తెలిపారు. రాత్రి హోటల్లో బస చేసిన 67 మంది ప్రమాదంలో చిక్కుకోవడంతో.. అగ్నిమాపక సిబ్బంది సురక్షితంగా కాపాడి బయటకు పంపారు.
హోటల్లో ఉన్న 67 మందిని చాకచక్యంగా కాపాడటంతో ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రాణహాని కాలేదు. మూడవ అంతస్తులో ఉన్న రెస్టారెంట్ పూర్తిగా దగ్ధం అయ్యింది. ఘటనకు సంబంధించి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. షాక్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా నిర్ధారించారు.
