నాంపల్లి రైల్వే స్టేషన్ లో అగ్ని ప్రమాదం.. జైపూర్ ఎక్స్ప్రెస్ బోగిలో చెలరేగిన మంటలు

నాంపల్లి రైల్వే స్టేషన్ లో అగ్ని ప్రమాదం.. జైపూర్ ఎక్స్ప్రెస్ బోగిలో చెలరేగిన మంటలు

హైదరాబాద్: నాంపల్లి రైల్వేస్టేషన్ లో శుక్రవారం (మే15) సాయంత్రం భారీ అగ్నిప్రమాదం జరిగింది. స్టేషన్ లో ఆగివున్న హైదరాబాద్ - జైపూర్ స్పెషల్ ట్రైన్ బోగీల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఏసీ కోచ్ B2 బోగిలో చెలరేగిన మంటలు క్షణాల్లో ఇతర బోగీలకు వ్యాపించాయి. దీంతో ప్రయాణికులు భయంతో పరుగులు పెట్టారు. విషయం తెలుసుకున్న  రైల్వే పోలీసులు, ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలార్పారు. ఘటన  జరిగినప్పుడు బోగీలలో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ప్రమాద సమయంలో హైదరాబాద్ నుంచి జైపూర్ కు వెళ్లేందుకు ప్లాట్ ఫాం పై వేచి ఉందని అధికారులు తెలిపారు.