సీఎం, మంత్రుల పేర్లు చెప్పి వసూళ్లు...మేడ్చల్ లో ఒకరు అరెస్ట్

సీఎం, మంత్రుల పేర్లు చెప్పి వసూళ్లు...మేడ్చల్ లో ఒకరు అరెస్ట్

మేడ్చల్ వెలుగు:  సీఎం, మంత్రులు వసూల పేర్లు చెప్పి డబ్బులు చేస్తున్న ఒకరిని మేడ్చల్ పోలీసులు అరెస్ట్ చేశారు. మెదక్ జిల్లా శివంపేటకు చెందిన సంతోష్ గుప్తా మేడ్చల్ పరిధిలోని మునీరాబాద్ లో ఆర్ఆర్ రియల్ ఎస్టేట్ సంస్థ వ్యాపారికి ఫోన్​చేశాడు. ‘నేను సీఎం మనిషిని.. నువ్వు కట్టిన ఐదు విల్లాలు అమ్మి డబ్బులు ఇస్తే మంచిది. లేకపోతే బాగుండదు’ అని బెదిరించాడు. 

దీంతో అతడు పోలీసులను ఫిర్యాదు చేయగా, నిందితుడిని అరెస్టు చేశారు. సంతోష్ గుప్తా పలు ప్రాంతాల్లో సీఎం పీఏని, పీసీసీ సభ్యుడిని అంటూ పలువురు వ్యాపారులను బెదరించి డబ్బులు వసూలు చేసినట్టు తెలిసింది. దీంతో నిందితుడిని బుధవారం రిమాండ్ కు తరలించినట్లు పేట్ బషీరాబాద్ ఏసీపీ శంకర్ రెడ్డి తెలిపారు.