బాధితురాలికి నిందితునితో పెండ్లి చేయాలనడం సరికాదు : మీనాక్షి నటరాజన్

బాధితురాలికి నిందితునితో పెండ్లి చేయాలనడం సరికాదు : మీనాక్షి నటరాజన్
  • బండి భగీరథ్​వ్యవహారంపై మీనాక్షి నటరాజన్ వ్యాఖ్య

హైదరాబాద్, వెలుగు: బాధితురాలికి నిందితుడితో పెండ్లి చేయాలని సూచించడం సరికాదని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి మీనాక్షి నటరాజన్ అన్నారు. ప్రతి రాజకీయ పార్టీ సామాజిక–లింగ న్యాయ అవగాహన కమిటీలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏర్పడిందని అభిప్రాయపడ్డారు. బుధవారం ఆమె సోషల్ మీడియా వేదికగా బండి భగీరథ్ కేసుపై స్పందించారు.  తెలంగాణలో కేంద్ర మంత్రి కొడుకు బండి భగీరథ్ కేసును పరిశీలిస్తే సామాజిక, లింగ న్యాయ అవగాహన కమిటీల అవసరం తెలుస్తుందన్నారు.

 పెరియార్ చెప్పినట్లుగా.. ఒకే కుల సమూహంలో కూడా అత్యంత అట్టడుగున ఉండి, ఎక్కువగా ప్రభావితమయ్యేది మహిళలేనని ఆమె పేర్కొన్నారు. కుల వ్యవస్థలో పాతుకుపోయిన  ఆధిపత్యానికి  పురాతన పితృస్వామ్యం ప్రధాన కారణమన్నారు. పితృస్వామ్య సమాజంలో దాడులకు పాల్పడిన అబ్బాయిల పెంపకాన్ని ఎవరూ ప్రశ్నించకపోవడం దురదృష్టకరమని మీనాక్షి నటరాజన్ ఆవేదన వ్యక్తం చేశారు.