మేఘాలయలో ఏరువాక పండుగ

మేఘాలయలో  ఏరువాక పండుగ

తొలకరి చినుకులు పడగానే పొలాలు దున్ని ఏరువాక పండుగ చేసుకుంటాయి రైతు కుటుంబాలు. మనదేశంలో ఈ పండుగని ఒక్కో చోట ఒక్కోలా చేసుకుంటారు.  ఈశాన్య రాష్ట్రమైన మేఘాలయలో ప్రజలు ‘బె​డిఎంఖ్లం’ పేరుతో హార్వెస్ట్ ఫెస్టివల్ చేసుకుంటారు. జైన్షియా కొండ ప్రాంతంలో ఉండే జైన్షియా వంశానికి చెందిన ప్రజలకు ఇది ముఖ్యమైన ఫెస్టివల్.

‘బె​డిఎంఖ్లం’ అంటే కలరా మహమ్మారిని తరిమేయడం అని అర్థం. ఈ పండుగని  నాలుగు రోజులు చేసుకుంటారు. ఈ సందర్భంగా పంటలు బాగా పండాలని తమ ఇష్టదైవాన్ని పూజిస్తారు. మహిళలు తమ పూర్వీకులకు అన్నసంతర్పణం చేస్తారు. గడ్డి, వెదురు కర్రలతో గుడిసెలు తయారుచేస్తారు. పొడవైన వెదురుకర్రలకు, రంగు పేపర్లు అతికించి తొట్టెల లాంటివి తయారు చేసి ఊరేగిస్తారు. నదుల్లో పెద్ద వెదురు కర్రల్ని పడేస్తారు. అంతేకాదు దుష్టశక్తులు, రోగాలకు కారణమయ్యే క్రిములు తొలగిపోవాలని వెదురు కర్రలతో ఇండ్ల పైకప్పు మీద కొడతారు. పిల్లలు, యువత చెక్కతో తయారుచేసిన  బంతితో  ఫుట్​బాల్ ఆడతారు. పండుగ చివరి రోజు సంప్రదాయ డ్రెస్​లు వేసుకొని అంతా ఒకచోట చేరతారు. కొందరు డ్రమ్స్​ వాయిస్తుంటే మిగతావాళ్లు డాన్స్​ చేస్తారు.