ఎన్నికల డ్యూటీ నుంచి ఇంటికి వచ్చిన వెంటనే గుండెపోటు

ఎన్నికల డ్యూటీ నుంచి ఇంటికి వచ్చిన వెంటనే గుండెపోటు

కోల్ బెల్ట్, వెలుగు: ఎన్నికల డ్యూటీ నుంచి వచ్చిన వెంటనే ఓ టీచర్ గుండె పోటుతో మరణించారు. మంగళవారం మంచిర్యాల జిల్లాలో ఈ విషాదం చోటు చేసుకుంది. గడిగొప్పుల సదానందం (46) మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ లోని జడ్పీ హైస్కూల్ లో ఫిజికల్ డైరెక్టర్ గా పని చేసేవారు. సోమవారం బెల్లంపల్లి నియోజకవర్గం కాసిపేట మండలం మల్కాపల్లిలో పీవోగా డ్యూటీ చేశారు. విధులు నిర్వహించిన తర్వాత మంచిర్యాల పట్టణంలోని గోపాల్ వాడలోని ఇంటికి చేరుకున్నారు. ఆ తర్వాత కాసేపటికే అస్వస్థతకు గురయ్యారు. వెంటనే కుటుంబ సభ్యులు చికిత్స కోసం స్థానిక హాస్పిటల్ కు తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో మంగళవారం ఉదయం సదానందం చనిపోయారు.