సీఎం రేవంత్ గురించి మాట్లాడితే తరిమికొడ్తాం : మెట్టు సాయి

సీఎం రేవంత్ గురించి మాట్లాడితే తరిమికొడ్తాం : మెట్టు సాయి
  • ఎంపీ అర్వింద్‌ కు ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మన్ మెట్టు సాయి వార్నింగ్

హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి గురించి ఇంకోసారి తప్పుగా మాట్లాడితే తరిమికొడ్తామని రాష్ట్ర ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మన్ మెట్టు సాయి హెచ్చరించారు. సోమవారం గాంధీ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీలో 8 మంది ఎంపీలు ఉంటే 16 గ్రూపులు ఉన్నాయని ఎద్దేవా చేశారు.

మోదీ హవాలో గెలవడం తప్ప, సొంతగా వార్డు మెంబర్‌‌గా కూడా గెలిచే సత్తా అర్వింద్‌కు లేదని విమర్శించారు. అలాంటి వ్యక్తి సీఎం రేవంత్ రెడ్డిని విమర్శిస్తే తామేంటో చూపిస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఎప్పుడూ పచ్చి అబద్ధాలు మాట్లాడుతుండటం వల్లే అర్వింద్ తెలంగాణ జనంలో చులకనైపోతున్నారని మండిపడ్డారు.