బ్యూటీ క్వీన్ దివ్యభారతి బయోపిక్లో..మిల్కీబ్యూటీ తమన్నా!

బ్యూటీ క్వీన్ దివ్యభారతి బయోపిక్లో..మిల్కీబ్యూటీ తమన్నా!

మిల్కీబ్యూటీ తమన్నా(Tamannaah) ముందుకు క్రేజీ ప్రాజెక్ట్​ వచ్చింది. మహానటితో కీర్తి సురేశ్​ ఓవర్​నైట్​ స్టార్ డమ్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు బాలీవుడ్​ దివంగత నటి దివ్యభారతి( DivyaBharathi) బయోపిక్​ ఆఫర్​ తమన్నాను వరించింది.

టీనేజ్ లోనే హీరోయిన్ గా మారిన దివ్యభారతి.. తెలుగులో విక్టరీ వెంకటేష్ హీరోగా వచ్చిన బొబ్బిలి రాజా సినిమాతో డెబ్యూ చేసింది. తన ఫస్ట్ మూవీ సక్సెస్ అవ్వడంతో వరుస అవకాశాలు అందుకుంది. మళ్ళీ మోహన్ బాబు హీరోగా అసెంబ్లీ రౌడీ, చిరుతో రౌడీ అల్లుడు లాంటి సూపర్ హిట్స్ తో ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ఆ తర్వాత నా ఇల్లే నా స్వర్గం, చిట్టెమ్మ మొగుడు లాంటి ప్లాప్స్ వల్ల దివ్యభారతి బాలీవుడ్ వైపు అడుగులు వేసింది.

తెలుగులో దివ్య భారతి లాస్ట్ మూవీ తొలిముద్దు. ఆ సినిమా టైమ్ లోనే దివ్యభారతి..1993 ముంబైలో తన స్వంత అపార్ట్ మెంట్ లో అంతస్థు పైనుంచి పడిపోయి ప్రాణాలు పోగొట్టుకుంది. అలా 1990ల్లో  సినీ ఇండస్ట్రీని ఊపేసిన ఈ నటి అర్ధాంతరంగా మృతి చెందింది. దివ్యభారతి మూడే మూడు సంవత్సరాలలో స్టార్ హీరోల సరసన 20 సినిమాలకు పైగా నటించింది. బ్యూటీ క్వీన్ గా ఎదిగి స్టార్ హీరోయిన్ల గుండెల్లో సైతం సెగలు పుట్టించిన దివ్య భారతి మృతికి కారణం ఇప్పటికీ మిస్టరీగానే ఉండిపోయింది.

అయితే, ప్రసెంట్ జనరేషన్ వారికి దివ్య భారతి అంటే ఎవరో తెలియకపోవొచ్చు. కానీ నిన్నటి తరం ప్రేక్షకులు, సినీ అభిమానులకు మాత్రం ఆమె మరణంపై చాలా రకాల అనుమానాలు ఉన్నాయి. దీంతో ఆమె జీవితాన్ని తెరపై ఆవిష్కరించే ప్రయత్నం జరుగుతోంది. అయితే, దివ్య భారతికి ఏమాత్రం సంబంధం లేని మలయాళ ఇండస్ట్రీ వారు ఈ సినిమాను ప్లాన్​ చేయడం విశేషం. ఇందుకోసం తమన్నాతో చర్చలు కూడా జరిగినట్టు తెలుస్తోంది. కానీ, ఇలాంటి బయోపిక్​కు తమన్నా ఓకే అంటుందా లేదా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్​గా మారింది.

తమన్నా రీసెంట్గా భోళా శంకర్, లస్ట్ స్టోరీస్, జైలర్ వరుస మూవీస్లో యాక్ట్ చేసి మంచి ఫామ్లో ఉంది.