బీహార్ లో ఐదు స్థానాల్లో ఎంఐఎం విజయం

బీహార్ లో ఐదు స్థానాల్లో ఎంఐఎం విజయం

బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ ఐదు అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించింది. అమౌర్, కోచధామన్, బైసీ, బహదూర్ గంజ్, జోకిహట్ నియోజకవర్గాల్లో గెలిచిందని ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ ట్వీట్ చేశారు. మరికొన్ని స్థానాల్లో గట్టి పోటీ ఇచ్చినట్లు సమాచారం. ఏ పార్టీ మద్దతు లేకుండా ఒంటరిగా బరిలోకి దిగి తమ సత్తా చాటినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తాజా ఎన్నికల ఫలితాలతో ఎంఐఎం పార్టీ బీహార్ అసెంబ్లీలో.. బయట కీలకపాత్ర పోషించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు పార్టీ వర్గాల సమాచారం.