హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ నేతలతో కాంగ్రెస్ నాయకులు టచ్ లో ఉన్నారని అంటున్న మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి.. వారి పేర్లను బయటపెట్టాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడారు.
ఇతర పార్టీల గురించి మాట్లాడే ముందు ఆ పార్టీలో ఉన్న కుటుంబ తగాదాలు సరిచేసుకోవాలని సూచించారు. బీజేపీ ఎంపీ అర్వింద్... సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు చేయడం సరికాదన్నారు. తెలంగాణలో వరి ధాన్యం గోదాములు నిండిపోయి రైతులు ఇబ్బందులు పడుతున్నారని, ప్రధాని మోదీతో లేదా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రితో మాట్లాడి రైతుల సమస్యలు పరిష్కరించాలని కోరారు.
