- మంత్రి అడ్లూరి లక్ష్మణ్
హైదరాబాద్, వెలుగు: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు అబద్ధాలు చెప్తున్నారని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఆరోపించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో ఉండి మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ను తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అపాయింట్‌మెంట్ కోరలేదని మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు.
ఒకవేళ రేవంత్‌రెడ్డి అపాయింట్‌మెంట్ అడగకపోతే మహారాష్ట్ర సీఎం ఆఫీస్ ఖండించాలని, మరి వారు ఎందుకు దీనిపై స్పందించడం లేదని బుధవారం ఒక ప్రకటనలో ప్రశ్నించారు.
