టిమ్స్లో అన్ని సౌలతులు..పక్కాగా ఉండాలి:  దామోదర   

టిమ్స్లో అన్ని సౌలతులు..పక్కాగా ఉండాలి:  దామోదర   

హైదరాబాద్, వెలుగు:  సనత్ నగర్ టిమ్స్ లో మౌలిక సదుపాయాలు, వైద్య పరికరాల ఏర్పాటుతో పాటు డాక్టర్లు, సిబ్బంది నియామకం చేపట్టాలని ఉన్నతాధికారులను మంత్రి దామోదర ఆదేశించారు. గురువారం సనత్ నగర్ టిమ్స్​పై ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ఆఫీస్‌‌లో ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు.

గత ప్రభుత్వ హయాంలో 2023 ఫిబ్రవరిలో పనులు మొదలైనప్పటికీ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడే నాటికి 13.14 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయని అధికారులు మంత్రికి వివరించారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో పనుల్లో వేగం పెంచి, కేవలం రెండున్నర ఏళ్లలోనే భవన నిర్మాణం, ఎక్విప్‌‌మెంట్ కొనుగోలు ప్రక్రియను పూర్తి చేశామని తెలిపారు.