సౌత్ ఇండియాలో హ్యాట్రిక్ కొట్టేది కేసీఆరే: గంగుల కమలాకర్

సౌత్ ఇండియాలో హ్యాట్రిక్ కొట్టేది కేసీఆరే: గంగుల కమలాకర్


వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి  కేసీఆర్ హ్యాట్రిక్ కొడతారని ధీమా వ్యక్తం చేశారు మంత్రి గంగుల కమాలాకర్. ఇప్పటి వరకు సౌత్ ఇండియా నుంచి వరుసగా మూడోసారి గెలిచిన సీఎం ఎవ్వరూ  లేరని ..  ఇపుడు కేసీఆర్ గెలవబోతున్నారన్నారు. 

కరీంనగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో  జాతీయ జెండా ఎగురవేశారు మంత్రి. ఈసందర్భంగా మాట్లాడిన ఆయన.. వచ్చే ఎన్నికల్లో మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి రాబోతుందన్నారు. ప్రజల నాడిని బట్టి   జిల్లా ఎమ్మెల్యేలంతా గెలవబోతున్నారని చెప్పారు.  కాంగ్రెస్, బీజేపీ చేతిలో రాష్ట్రాన్ని పెట్టేందుకు ప్రజలు సిద్ధంగా లేరన్నారు.  కేసీఆర్ హయాంలో తెలంగాణ నంబర్ వన్ రాష్ట్రంగా అభివృద్ది చెందిందన్నారు. కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం రైతు రుణమాఫీ చేశారని చెప్పారు.