డాక్టర్లు నిరసన ఆపాలి : మంత్రి హర్షవర్ధన్

డాక్టర్లు నిరసన ఆపాలి : మంత్రి హర్షవర్ధన్

నేషనల్ మెడికల్ కమిషన్ బిల్లుపై దేశమంతటా జరుగుతున్న డాక్టర్ల నిరసనపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ స్పందించారు. డాక్టర్లందరూ నిరసన ఆపి.. వెంటనే డ్యూటీకి ఎక్కాలని రిక్వెస్ట్ చేశారు. “నేను డాక్టర్ల సంఘం ప్రతినిధులను, డాక్టర్లను కలిశాను. వారికి ఉన్న తప్పుడు అభిప్రాయాలను తొలగించాను. నేషనల్ మెడికల్ కమిషన్ బిల్లులోని కొన్ని ప్రొవిజన్స్ లో ఉన్న డౌట్స్ కూడ క్లారిఫై చేశాను. ఇది దేశం మంచికోసం మోడీ ప్రభుత్వం తీసుకొస్తున్న బిల్లు. త్వరలోనే ఈ బిల్లు గొప్పదనం అందరికీ తెలుస్తుంది. ఇది డాక్టర్లు, పేషెంట్ల బాగుకోరి తీసుకొస్తున్న బిల్లు. దయచేసి డాక్టర్లు అందరూ తమ నిరసన ఆపాలి” అని అన్నారు మంత్రి హర్షవర్ధన్.

మరోవైపు.. బిల్లును వ్యతిరేకిస్తూ దేశమంతటా డాక్టర్ల ఆందోళన కొనసాగుతోంది.