రామప్ప దేవాలయం అభివృద్ధి చేస్తాం

రామప్ప దేవాలయం అభివృద్ధి చేస్తాం

అతి ప్రాచీన కట్టడం అయిన రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు లభించడం అభినందనీయమన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. తెలుగు రాష్ట్రాల్లో అనేక కట్టడాలు ఉన్న గుర్తింపు తెచ్చుకోలేకపోయాయన్నారు.  చాలా దేశాలు రామప్ప దేవాలయం ను వ్యతిరేకించాయని.. అయితే దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఏ దేశాలు అయితే రామప్ప గుర్తింపు కు అడ్డుకున్నాయో వాటి ద్వారానే అద్భుత కట్టడం అని చెప్పించిన ఘనత ప్రధాని మోడీకే దక్కుతుందన్నారు. ఇవాళ(గురువారం) ములుగు జిల్లాలోని రామప్ప దేవాలయాన్ని సందర్శించిన  కిషన్ రెడ్డి..ఆ తర్వాత మాట్లాడారు.

కరోనా వచ్చినప్పుడు మందుల కోసం మనం వేరే దేశాల వైపు చూడలేదన్నారు కిషన్ రెడ్డి. యువత మేధావి మీదా నమ్మకం పెట్టుకొని స్వదేశం లో వ్యాక్సిన్ తయారు చేసుకున్నామన్నారు. అంతే కాదు ఈ రోజుకు 100 కోట్ల డోసులు ప్రజలకు ఇచ్చామని తెలిపారు. ఇక నుండి 12 నుంచి 18 ఏళ్ల వయస్సు లోపు వాళ్లకు కూడా వ్యాక్సిన్ ఇవ్వబోతున్నామన్నారు. రామప్ప దేవాలయం అభివృద్ధికి పూర్తి స్థాయిలో సహకరిస్తామని, టూరిజం కోసం పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం నిధులతో తెలంగాణ లోని ఆలయాలు.. టూరిజం అభివృద్ధి చేశామన్నారు.

వరంగల్‌ కోట, వెయ్యి స్తంభాల గుడి కి ప్రాధాన్యత ఇస్తూ పెద్ద ఎత్తున నిధులు ఇచ్చి.. అభివృద్ధి చేస్తామన్నారు. కరోనా కారణంగా విదేశీ టూరిస్టులు రావడంలేదన్నారు. కరోనా తగ్గుముఖం పట్టడం తో విదేశీ టూరిస్టులు వచ్చేందుకు మొగ్గుచూపుతున్నారన్నారని మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. వరంగల్ ఎయిర్ పోర్టు ఇచ్చేందుకు కేంద్రం ప్రభుత్వం సుముఖంగా వుందని, ఎయిర్ పోర్టు వస్తే టూరిజం మరింతగా పెరుగుతుందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. తక్కువ ఛార్జీలతో వరంగల్ కి విమానాలను నడుపుతామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం భూమి అప్పగిస్తే ఉడాన్ స్కిమ్ లో ఎయిర్ పోర్ట్ కు కృషి చేస్తామన్నారు. అంతకుముందు ములుగులో గట్టమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు కిషన్ రెడ్డి.