Puri,Teja: తేజ సజ్జ, పూరి జగన్నాధ్ కాంబో.. వైరల్ అవుతున్న క్రేజీ న్యూస్

Puri,Teja: తేజ సజ్జ, పూరి జగన్నాధ్ కాంబో.. వైరల్ అవుతున్న క్రేజీ న్యూస్

సినీ ఇండస్ట్రీలో ఎప్పుడు ఏ కాంబో సెట్ అవుతుంది, ఎప్పుడు ఏ సినిమా అర్దాంతరంగా ఆగిపోతుంది అనేది ఎవ్వరూ చెప్పలేరు. దానికి సవాలక్ష కారణాలు ఉండొచ్చు. కొన్ని కొన్ని సార్లు అనుకోని కంబోలు సెట్ అయ్యి ఆడియన్స్ కు షాకిస్తూ ఉన్నాయి. ఆలాంటి కంబోనే ఒకటి టాలీవుడ్ లో సెట్ కానుంది అనే వార్తలు ఇండస్ట్రీ వర్గాల్లో వైరల్ అవుతున్నాయి. 

ఇంతకీ ఆ కాంబో ఏంటంటే.. హనుమాన్ హీరో తేజ సజ్జ, డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాధ్. అవును.. ఈ కాంబోలో మూవీ సెట్ అయ్యిందనే వార్తలు ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ వర్గాల్లో తెగ వైరల్ అవుతున్నాయి. ఇటీవల పూరి తేజకి ఒక కమర్షియల్ కంటెంట్ ఉన్న సాలిడ్ కథని చెప్పాడని, ఆ కథ తేజకి కూడా బాగా నచ్చిందని, పాన్ ఇండియా లెవల్లో భారీఆ రానున్న ఈ ప్రాజెక్టుపై  త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని టాక్. అయితే.. ఈ న్యూస్ గురించి తెలిసిన కొంతమంది మాత్రం ఈ వార్తలను కొట్టిపారేస్తున్నారు. 

కారణం.. హీరో తేజ సజ్జ ఇప్పుడిప్పుడే తన కెరీరి ను సెట్ చేసుకునే పనిలో ఉన్నాడు. ఇక పూరి గురించి చెప్పాలంటే ఆయన చివరిగా చేసిన లైగర్ మూవీ ఎంత పెద్ద డిజాస్టర్ గా నిలిచిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎప్పుడు హిట్టు కొడతాడో కూడా తెలియదు. ప్రస్తుతం ఆయన హీరో రామ్ తో డబుల్ ఇస్మార్ట్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా హిట్ అయితే ఒకే కానీ, ప్లాప్ అయితే మారం పూరి డిమాండ్ ఇంకా తగ్గే అవకాశం ఉంది. మరి ఇలాంటి సమయంలో తేజ రోజా పూరికి ఒకే చెప్తాడా అనేది ఆస్కతికరంగా మారింది. అందుకే..  ఈ కాంబో సెట్ అయ్యే అవకాశం లేదనే కామెంట్స్  వినిపిస్తున్నాయి.