ఎర్రబస్సు నుంచి ఎయిర్ బస్ దాకా అన్నీ తెలంగాణకే

ఎర్రబస్సు నుంచి ఎయిర్ బస్ దాకా అన్నీ తెలంగాణకే

హైదరాబాద్, వెలుగు: ట్రాక్టర్ నుంచి హెలికాప్టర్ దాకా, ఎర్రబ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్సు నుంచి ఎయిర్ బ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్ దాకా, టైల్స్ నుంచి టెక్స్​టైల్స్ దాకా, యాప్స్ నుంచి యాపిల్ దాకా ప్రతి ప‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రిశ్రమ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గమ్యస్థానం తెలంగాణ రాష్ట్రమే అని రాష్ట్ర మున్సిపల్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ సర్కారు పారిశ్రామికీకరణకు పెద్దపీట వేస్తోందని, సింగిల్ విండో సిస్టమ్ ద్వారా పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలు అందజేస్తోందని తెలిపారు. ఆరేండ్లలో 17,302 పరిశ్రమలు స్థాపించి రెండు లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు తీసుకొచ్చినట్లు గుర్తు చేశారు. అసెంబ్లీలో సోమవారం ఐటీ రంగాల ప్రగతిపై జరిగిన స్వల్పకాలిక చర్చలో ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు ఆయన వివరణ ఇచ్చారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, అభివృద్ధే శాశ్వతంగా ఉంటుందని రాష్ట్రంలో మరో 20 ఏండ్లు టీఆర్ఎస్ పార్టీనే అధికారంలో కొనసాగుతుందన్నారు. రాష్ట్రంలో ఐటీ, ఎల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క్ట్రానిక్స్, టెక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైల్స్, ఫార్మాస్యూటిక‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్స్, ఏరోస్పేస్, డిఫెన్స్, లైఫ్ సైన్సెస్, ఫుడ్ ప్రాసెసింగ్ ను ప్రాధాన్య రంగాలుగా ఎంచుకున్నామని కేటీఆర్ తెలిపారు.  

40 ఏండ్ల అభివృద్ధి ఆరేండ్లలో..

ఏపీఐఐసీ ఆధ్వర్యంలో 40 ఏండ్లలో 23,500 ఎకరాల్లో ఇండస్ట్రియల్​పార్కులు ఏర్పాటు చేస్తే టీఎస్ఐఐసీ ఆధ్వర్యంలో ఆరేండ్లలోనే 19,165 పార్కులో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పవర్, ఇరిగేషన్, రోడ్ల అభివృద్ధికి అప్పు చేయడం తప్పు కాదన్నారు. వ్యవసాయ రంగానికి అనుబంధంగా ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ల ఏర్పాటుకు10 వేల ఎకరాల స్థలం గుర్తించినట్లు తెలిపారు. చేనేత రంగాన్ని ఆదుకున్న ఘనత సీఎం కేసీఆర్ దేనని, రాష్ట్రంలో చేనేత కార్మికుల ఆత్మహత్యలు ఆగిపోయాయని గుర్తు చేశారు. టెక్స్ టైల్ మెగా పార్కుకు కేంద్రం రూపాయి ఇవ్వలేదన్నారు. వరంగల్ లో మెగా కాకతీయ టెక్స్ టైల్  పార్కును 1,190 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. చేనేత చేయూత పథకం కింద రూ.96 కోట్లు విడుదల చేసి 21 వేల మంది నేతన్నలను ఆదుకుంటున్నట్లు వెల్లడించారు. ముచ్చర్ల ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మా క్లస్టర్​గా మారనుందని మంత్రి కేటీఆర్ తెలిపారు.  కార్పొరేట్ కంపెనీల కోసం భూసేకరణ చేయాల్సి ఉంటుందని, మన పిల్లలకు కంపెనీల్లో ఉద్యోగాలు రావాలంటే కొంత త్యాగాలు చేయక తప్పదన్నారు. 

పాదయాత్రలు చేస్తూ

ప్రతిపక్ష నాయకులు పాదయాత్రలు చేస్తూ తమ ప్రభుత్వానికి బ్రాండ్ అంబాసిడర్లుగా మారారని మంత్రి కేటీఆర్ అన్నారు. వాళ్లు నడుస్తూ పోతుంటే ఎక్కడపడితే అక్కడ పుష్కలంగా నీళ్లు, పచ్చని పైర్లు, చెరువుల్లో చేపలు, ఇంటి ముందే తాగునీరు కనిపిస్తున్నాయని, వీటన్నింటికి వాళ్లు బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరిస్తున్నారని వెల్లడించారు. అందుకు ప్రతిపక్ష నాయకులకు ధన్యవాదాలు 
తెలిపారు.

ఐటీ రంగంలో ఉపాధి.. 

ఐటీ రంగంలో మూడున్నర లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించామని వెల్లడించారు. కరీంనగర్ లో ఐటీ హబ్ ను ప్రారంభించామని, సిద్దిపేట, నల్లగొండ, మహబూబ్ నగర్ లాంటి పట్టణాల్లో కూడా ఐటీ పరిశ్రమలు వచ్చాయని తెలిపారు. సామాన్యుడికి ఉపయోగపడని టెక్నాలజీ నిష్పలమని కేటీఆర్ చెప్పారు. ఐటీ రంగంలో అభివృద్ధి జరిగిందని బీజేపీ, ఎంఐఎం కూడా ఒప్పుకున్నాయని తెలిపారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన పరిశ్రమలు, ఐటీ కంపెనీల్లో కలిపి మొత్తం కలిపి 19.5 లక్షల  మందికి ఉపాధి అవకాశం కల్పించినట్లు వెల్లడించారు. అలాగే 1,32,899 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించినట్లు తెలిపారు. 95 శాతం ఉద్యోగాలను స్థానికులకే ఇచ్చేలా జోనల్ వ్యవస్థను తీసుకొచ్చినట్లు ప్రకటించారు.