హైదరాబాద్, వెలుగు: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును భారత్-పాకిస్తాన్ విభజనతో పోల్చి బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య పార్లమెంట్లో చేసిన వ్యాఖ్యలపై ఖండించాలని, వాటిని లోక్సభ రికార్డుల నుంచి తొలగించేలా లోక్ సభ స్పీకర్ కు లేఖ రాయాలని ఏపీ సీఎం చంద్రబాబుకు మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు.
ఈమేరకు మంగళవారం మంత్రి లేఖ రాశారు. గతంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సైతం తెలంగాణ ప్రజలను కించపరిచేలా మాట్లాడారని లేఖలో ప్రస్తావించారు. ‘‘ఇటు బీజేపీ, అటు జనసేన.. రెండు పార్టీలు కూడా ఎన్డీయేలో భాగస్వాములుగా ఉన్నందున ఈ అంశాలు వారి దృష్టికి తీసుకువస్తున్నట్లు పొన్నం చెప్పారు.

