V6 News

అనంత్ అంబానీ వాచీలో 300 వజ్రాలు.. తిరిగేది టైమా.. వజ్రాలా..!

అనంత్ అంబానీ వాచీలో 300 వజ్రాలు.. తిరిగేది టైమా.. వజ్రాలా..!

ఖరీదైన వాచ్‌లు సేకరించడంలో అనంత్ అంబానీ స్టైలే వేరు. కొత్తగా ఆయన ధరించిన ఒక అరుదైన వాచ్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఇది కేవలం టైం చూపే వాచ్ మాత్రమే కాదు, అద్భుతమైన కళాఖండం.

ఈ వాచ్ ప్రత్యేకతలు ఏంటంటే...  ఈ వాచ్ మధ్యలో పరమశివుని చిన్న విగ్రహం చాలా అందంగా చెక్కబడి ఉంటుంది. అంతేకాకుండా, దీనిపై 'ఓం' అనే గుర్తు కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఆధ్యాత్మికతను, ఆధునిక టెక్నాలజీని కలిపి దీనిని తయారు చేశారు.

ఈ వాచ్ మెరుపు మామూలుగా ఉండదు.  దీని కేస్‌పైనే 300కు పైగా బాగెట్-కట్ వజ్రాలను పొదిగారు. దీని బాడీని '18 క్యారెట్ల రోజ్ గోల్డ్'తో తయారు చేశారు.

ఈ వాచ్‌లో ఒక చిన్న మ్యూజిక్ బాక్స్ కూడా ఉంటుంది. అది మనకు కావలసినప్పుడు ఒక ప్రత్యేకమైన ట్యూన్‌ను వినిపిస్తుంది. ఈ వాచ్‌లో 658 భాగాలతో కూడిన అత్యంత కాంప్లెక్  మెకానిజం ఉంది. ఇందులో వాచ్ తయారీలో అత్యంత అధునాతన ఫీచర్లలో ఒకటైన ఫ్లయింగ్ ట్రిపుల్-యాక్సిస్ టోర్బిలాన్ కూడా ఉంది. 

దీని విలువ సుమారు 10 నుండి 12 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన 'జాకబ్ & కో' అనే లగ్జరీ బ్రాండ్ దీనిని అనంత్ అంబానీ కోసం ప్రత్యేకంగా రూపొందించింది. భారతదేశంలో ఇప్పటివరకు కనిపించిన అత్యంత ఖరీదైన, అరుదైన వాచ్‌లలో ఇది ఒకటిగా నిలుస్తుంది.