కార్ల ప్రియులకు అదిరిపోయే వార్త. కొత్త ఆర్థిక సంవత్సరం ఆరంభంలోనే టాప్ ఆటోమొబైల్ కంపెనీలు కస్టమర్లపై ఆఫర్ల వర్షం కురిపిస్తున్నాయి. మారుతి సుజుకి, హ్యుందాయ్, టాటా మోటార్స్ తమ పాపులర్ మోడళ్లపై అత్యధికంగా రూ.3లక్షల 50వేల వరకు భారీ తగ్గింపులను ప్రకటించాయి. గతేడాది అమ్మకాల్లో దూసుకుపోయిన ఈ కంపెనీలు.. అదే జోరును ఈ ఏప్రిల్‌లోనూ కొనసాగించేందుకు డిస్కౌంట్స్ మేళా రన్ చేస్తున్నాయి. ఈ వేసవిలో మీరు కొత్త కారు కొనాలని ప్లాన్ చేస్తున్నట్లయితే ఏ ఏ కార్లపై ఎంతెంత డిస్కౌంట్ ఉందో ఈ పూర్తి వివరాలు మీకోసమే..
మారుతి సుజుకి:
దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి, తన ప్రీమియం నెక్సా పోర్ట్‌ఫోలియోపై భారీగా తగ్గింపులు ఇస్తోంది. ముఖ్యంగా ఇన్విక్టో ఎంపీవీపై అత్యధికంగా డిస్కౌంట్ లభిస్తోంది. అటు మాస్ మార్కెట్ మోడల్స్ అయిన ఎరీనా కార్లపై కూడా ఆకర్షణీయమైన ఆఫర్లు ఉన్నాయి.
ALSO READ : గాల్లోనే గుండె పోటు.. శంషాబాద్ ఎయిర్ పోర్టులో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
Nexa కార్ల ఆఫర్లు:
* మారుతి ఇన్విక్టో: రూ.2లక్షల 15వేలు డిస్కౌంట్
* గ్రాండ్ విటారా: రూ.లక్షా 7వేలు
* ఫ్రాంక్స్: రూ.55వేలు
* ఇగ్నిస్, జిమ్నీ, XL6: ఒక్కో మోడల్‌పై రూ.50వేలు
* బాలెనో: రూ.40వేలు
ఎరీనా కార్ల ఆఫర్లు:
* స్విఫ్ట్ & బ్రెజ్జా: రూ.45వేలు
* ఆల్టో K10, ఎస్-ప్రెస్సో, వ్యాగన్-ఆర్, సెలెరియో, ఈకో: రూ. 37వేల 500
* విక్టోరిస్: రూ.30వేలు
హ్యుందాయ్:
హ్యుందాయ్ మోటార్స్ కూడా తన అమ్మకాలను పెంచుకునేందుకు సెలెక్టెడ్ మోడళ్లపై రూ.60వేల వరకు ప్రయోజనాలను అందిస్తోంది. అయితే కంపెనీకి మంచి పేరు తెచ్చిపెట్టిన క్రెటా, వెన్యూ లాంటి మోడళ్లను ప్రస్తుతానికి ఆఫర్ల జాబితాలో చేర్చలేదు.
* గ్రాండ్ i10 నియోస్ & అల్కజార్: రూ.60వేలు
* హ్యుందాయ్ i20: రూ.50వేలు
* వెర్నా సెడాన్: రూ.35వేలు
* హ్యుందాయ్ ఆరా: రూ.15వేలు
టాటా మోటార్స్:
టాటా మోటార్స్ తన ఇంటర్నల్ కంబషన్ ఇంజన్ కార్లతో పాటు ఎలక్ట్రిక్ వాహనాలపై కూడా మైండ్ బ్లోయింగ్ ఆఫర్లను ప్రకటించింది. ఈ సీజన్‌లో అత్యధికంగా రూ.3లక్షల 50వేల డిస్కౌంట్ లభిస్తోంది టాటా ఎలక్ట్రిక్ కారుపైనే.
పెట్రోల్/డీజిల్ కార్ల ఆఫర్లు:
* టాటా కర్వ్ : రూ.55వేలు
* హారియర్ & సఫారీ: రూ.45వేలు
* టాటా ఆల్ట్రోజ్: రూ.35వేలు
* టియాగో, టిగోర్, నెక్సాన్: రూ.30వేలు
ఎలక్ట్రిక్ కార్లపై ఆఫర్లు:
* టాటా కర్వ్ EV: రూ. 3లక్షల 50వేలు
* హారియర్ EV: రూ. 2లక్షల 75వేలు
* టియాగో EV & పంచ్ EV (పాత మోడల్): రూ.లక్షా 60వేలు
* నెక్సాన్ EV: రూ.70వేలు
Note: పైన పేర్కొన్న ఆఫర్లలో కన్స్యూమర్ డిస్కౌంట్స్, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు, స్క్రాపేజ్ ఇన్సెంటివ్‌లు మరియు లాయల్టీ బెనిఫిట్స్ కలిసి ఉంటాయి. ఈ ఆఫర్లు ఏప్రిల్ 2026 చివరి వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. మీ ఊరు, కారు వేరియంట్, డీలర్‌షిప్‌ను బట్టి ఈ ఆఫర్లలో మార్పులు ఉండవచ్చు. కాబట్టి కారు బుక్ చేసే ముందు సమీప డీలర్‌ను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోవడం బెస్ట్.

