V6 News

ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్.. జిల్లాల్లో ఎక్కడికక్కడ నిలిచిపోయిన బస్సులు

ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్.. జిల్లాల్లో ఎక్కడికక్కడ నిలిచిపోయిన బస్సులు

తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. ఆర్టీసీ జేఏసీ నేతలతో రాష్ట్ర ప్రభుత్వం చర్చలు విఫలం కావడంతో తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు సమ్మెలోకి వెళ్లారు. బుధవారం (ఏప్రిల్ 23) అర్థరాత్రి ఆర్టీసీ కార్మికుల సమ్మె మొదలైంది. సమ్మె ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా బస్సులు రోడ్డెక్కడం లేదు. అన్ని జిల్లాల్లో బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. బస్టాండ్ల దగ్గర బస్సుల కోసం పడిగాపులు కాస్తున్నారు. ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి సారించింది. 

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆర్టీసీ  కార్మికులు సమ్మెకు దిగారు. దీంతో ఆదిలాబాద్ , ఉట్నూర్,  నిర్మల్,    బైంసా, ఆసిఫాబాద్ డిపోలలో బస్సులు నిలిచిపోయాయి. ఆర్టీసీ కార్మికులు తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. బస్టాండ్‎లు,  డిపోల దగ్గర భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 7 డిపోల ముందు ఆర్టీసి జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న సమ్మె. పాల్గొన్న వామ పక్షాలు.

ఆర్టీసీ సమ్మెలో భాగంగా అర్ధరాత్రి నుంచి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా నిలిచిపోయిన ఆర్టీసీ బస్సులు. 
డిపోలకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు. హుజురాబాద్ డిపో ఎదుట కార్మికుల ఆందోళన. ఆర్టీసీని ప్రభుత్వం లో విలీనం చేయాలని డిమాండ్. డిపో ఎదుట పోలీసుల భారీ బందోబస్తు. బస్టాండ్‏లో బస్సుల కోసం ఎదురుచూస్తున్న ప్రయాణీకులు 

ఆర్టీసీ జేఏసీ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా మంచిర్యాల డిపోలో స్వచ్ఛందంగా బంద్‎లో పాల్గొన్నారు ఆర్టీసీ ఉద్యోగులు. దీంతో మంచిర్యాల డిపోకి చెందిన 76 ఆర్టీసీ బస్సులు, 69 ప్రైవేట్ ఆర్టీసీ బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. తమ న్యాయమైన డిమాండ్ల ను పరిష్కరించాలని మంచిర్యాల ఆర్టీసీ డిపో ముందు ఆందోళన చేపట్టారు ఆర్టీసీ ఉద్యోగులు. ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె ఎఫెక్టుతో ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు ప్రయాణికులు.

భూపాలపల్లి డిపో వద్ద అర్ధరాత్రి నుండి డిపోలకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు. ఆర్టీసీ జేఏసీ పిలుపుతో సమ్మెకు దిగారు కార్మికులు. ఇబ్బందులు పడుతున్న ప్రజలు, విద్యార్థులు, ఉద్యోగులు.

నల్లగొండ  డిపోకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు. ఆర్టీసీ జేఏసీ పిలుపుతో సమ్మె. బస్టాండ్ లో నిరీక్షిస్తున్న ప్రయాణికులు. డిపో ఎదుట ఆందోళన చేస్తున్న ఉద్యోగులు. భారీగా మోహరించిన పోలీసులు.

సమ్మెకు దిగిన ఆర్టీసీ కార్మికులు. వరంగల్‌ రీజియన్‌ పరిధిలో 9 డిపోలు. సుమారు 4 వేల మంది డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్‌లు, సూపర్‌వైజర్లు, ఉద్యోగులు సైతం సమ్మెలో పాల్గొంటున్న కార్మికులు.
డిపోలల్లో నిలిచిన 920 ఆర్టీసీ బస్సులు

రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల జేఏసీ సమ్మె పిలుపు మేరకు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఆర్టీసీ డిపోలో కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. విధులను బహిష్కరించి డిపో ఎదుట నిరసన తెలిపారు. దీంతో 63 బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నారు.

 ఒకటి, రెండు బస్సులను మహాలక్ష్మి సర్వీస్ పేరుతో అధికారులు నడిపిస్తున్నారు. హుస్నాబాద్ బస్ స్టేషన్ ప్రయాణికులు లేక వేల వేల బోయింది. బస్ లు నడవకపోవడంతో ప్రయాణికులు ప్రైవేట్ వాహనాల్లో గమ్య స్థానాలకు వెళ్తున్నారు. ప్రైవేట్ వాహనాదారులు ఇదే అదునుగా భావించి ప్రయాణికుల నుండి అధిక రుసుము వసూలు చేస్తున్నారు.