మళ్లీ ఎల్‌ఎల్‌ఎం ఎంట్రెన్స్ రాసిన సీతక్క

మళ్లీ ఎల్‌ఎల్‌ఎం  ఎంట్రెన్స్ రాసిన సీతక్క

మంత్రి సీతక్క సోమవారం మౌలాలిలోని ఆయాన్ డిజిటల్ సెంటర్​లో ఎల్ఎల్ఎం ఎంట్రెన్స్ ఎగ్జామ్ రాశారు. ఇప్పటికే ఆమె ఎల్‌ఎల్‌బీ, కార్పొరేట్ లాలో ఎల్‌ఎల్‌ఎం, అలాగే పొలిటికల్ సైన్స్​లో పీహెచ్‌డీ పూర్తి చేశారు. 

అయితే, రాజ్యాంగంపై ఉన్న ప్రత్యేక ఆసక్తితో ఇప్పుడు ‘కానిస్టిట్యూషనల్ లా’ విభాగంలో మరోసారి ఎల్‌ఎల్‌ఎమ్ చేసేందుకు మంత్రి సీతక్క ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయడం విశేషం.

హైదరాబాద్, వెలుగు