జవాను అంత్యక్రియల్లో పాల్గొన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్

జవాను అంత్యక్రియల్లో పాల్గొన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్
మహబూబ్ నగర్: జమ్మూ కాశ్మీర్ లోని లడక్ లోని లేహ్ లో  దేశ సేవలో వీరమరణం పొందిన హవాల్దార్ పరుశురాం భౌతిక కాయానికి  ఆయన స్వస్థలమైన గండీడ్ మండలం గువ్వని కుంట తాండ లో అంత్యక్రియలు జరిగాయి. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. వీరమరణం పొందిన పరుశురామ్ అంతిమయాత్రలో రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. పరశురామ్ కుటుంబీకులను పరామర్శించి ఓదార్చారు. పరుశురామ్ తనయుడిని ఎత్తుకుని ముద్దాడారు. ప్రభుత్వం 25 లక్షలు  సాయం ప్రకటించడంపై స్థానికులు నిరసన వ్యక్తం చేయడంతో మంత్రి సర్ది చెప్పారు.  సాయం పెంచడానికి ప్రయత్నిస్తామని.. అన్ని విధాల నిలదొక్కుకునేలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. మంచుకొండలు విరిగిపడడంతో వీరమరణం పొందిన పరుశురామ్ అంత్యక్రియల సందర్భంగా ఆయన సహచరులైన సైనికులు గౌరవ సూచకంగా గాలిలోకి కాల్పులు జరిపారు. కన్నీటితో కడసారి నివాళులర్పించారు.