Xలో AI కొత్త అప్డేట్ గురూ.. స్టోరీస్‌గా ట్రెండింగ్ టాపిక్స్

Xలో AI  కొత్త అప్డేట్ గురూ.. స్టోరీస్‌గా ట్రెండింగ్ టాపిక్స్

ఎలన్ మస్క్ ట్విటర్ సీఈఓ అయ్యాక ఆ సోషల్ మీడియా ఫ్లాట్ ఫాంలో చాలా మార్పులు చేశాడు. పేరు, యాప్ సింబల్, ప్రీమియం సబ్ స్క్రీప్షన్ రూల్స్ ఇలా ఎన్నో ఛేంజస్ ఎలన్ మస్క్ తీసుకొచ్చాడు. కొత్త కొత్త అప్డేడ్స్ తో ఎక్స్ యాప్ ఎంగేజ్‌మెంట్ పెంచాడు. ఇప్పుడు ఎక్స్ లో స్టోరీస్ పేరిట మరో అప్డేట్ ప్రవేశపెట్టారు. ఎక్స్ Grok AI ద్వారా ఎక్స్‌లో  ట్రెండింగ్ టాపిక్స్ స్టోరీస్ లా ఓ షార్ట్ కట్ ఫాంలో  ప్లే అవుతాయి. 

ఈ స్టోరీస్ కోసం ఎక్స్ ఇంటర్ ఫేస్ లో ఓ స్పెషల్ బటన్ పెట్టారు.  ఏఐ ఆధారంగా యూజర్ల ఇంట్రెస్ట్ కంటెంట్ వరుసగా ప్లే అవుతాయి. ఎక్స్‌లో  గ్రోక్ ఏఐ స్టోరీస్ పొందాలంటే ప్రీమియం చెల్లించి సబ్ స్క్రిషన్ తీసుకోవాలి. ఇందులోని ఉపయోగించే గ్రోక్ ఏఐ ట్రెండింగ్, మీ అభిరుచులకు అనుగుణమైన టాపిక్స్‌ను స్టోరీస్ గా మలిచి చూపిస్తోంది.