హరీశ్ రావు ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పి మోసం చేశారు : నున్న రమణ

 హరీశ్ రావు ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పి మోసం చేశారు : నున్న రమణ

ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది. మాజీ మంత్రులు .సత్యవతి రాథోడ్, రేడ్యా నాయక్  ప్రధాన అనుచరుడు డోర్నకల్ బీఆర్ఎస్ పార్టీ మండల ఆధ్యక్షుడు పార్టీ నున్న రమణ రాజీనామా చేశారు.  తనను ఆర్ధిక పరంగా వాడుకుని వదిలేశారని ఆరోపించారు.తనకు ఎమ్మెల్సీ పదవి ఇస్తామని మాజీ మంత్రుల హరీశ్ రావు, సత్యవతి రాథోడ్ మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

 తనకు ఎమ్మెల్సీ పదవి ఇస్తామని చేప్పి తన దగ్గర డబ్బులు ఖర్చు పెట్టించారని చెప్పారు. వీరిపై చర్యలు తీసుకోవాలని కేసీఆర్ ను కోరారు.  ఆర్ధిక పరంగా నన్ను బాగ నష్టపరిచారని తెలిపారు.  ఈ విషయం ఎవరికి చేప్పిన పట్టించుకోవటం లేదని మనోవేదనకు గూరై బీఆర్ఎస్ పార్టీకీ రాజీనామా చేశానని తచెప్పారు.  త్వరలో ఏ పార్టీలో చేరేది వెల్లడిస్తానని నున్న రమణ తెలిపారు.