హైదరాబాద్, వెలుగు: ‘తెలంగాణ సంపదను అనకొండలా అమాంతం మింగేసిన జాతి మీదైతే, ప్రజలకు విశ్వాసంగా ఉన్న జాతి మాది’ అని కేటీఆర్ పై మంత్రి వాకిటి శ్రీహరి ఫైర్ అయ్యారు. మంగళవారం ఆయన హైదరాబాద్ లో మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. కేటీఆర్...సీఎం రేవంత్ రెడ్డిపై చేస్తున్న విమర్శలు ఆయన అహంకారానికి నిదర్శనమని, అధికారం కోల్పోయినా కేటీఆర్ లో అహంకారం ఏమాత్రం తగ్గలేదని మండిపడ్డారు.
‘తెలంగాణను దోచుకున్న రాబందులను తరిమికొట్టిన జాతి మాది.. ఎక్కుపెట్టిన తుపాకికి ఎదురుగా నిలబడ్డ ఉద్యమకారుల వెనుక దాక్కున్న జాతి మీది..’ అంటూ కేటీఆర్ పై ధ్వజమెత్తారు. ‘దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన జాతి, తెలంగాణ ఇచ్చిన జాతి మాది’ అని స్పష్టం చేశారు.
