తెలంగాణ దేశానికి రోల్ మోడల్ రాష్ట్ర యువతకు విదేశాల్లో పెద్ద ఎత్తున ఉపాధి: మంత్రి వివేక్‌‌‌‌

తెలంగాణ దేశానికి రోల్ మోడల్ రాష్ట్ర యువతకు విదేశాల్లో పెద్ద ఎత్తున ఉపాధి: మంత్రి వివేక్‌‌‌‌

కోల్​బెల్ట్, వెలుగు: స్కిల్​ డెవలప్‌‌‌‌మెంట్‌‌‌‌లో దేశానికి తెలంగాణ రోల్​మోడల్​అని మంత్రి వివేక్‌‌‌‌ వెంకటస్వామి తెలిపారు. రాష్ట్ర యువతకు విదేశాల్లో పెద్ద ఎత్తున ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం​ కృషి చేస్తున్నదని చెప్పారు. మంగళవారం మంచిర్యాల జిల్లా మందమర్రిలో వివేక్‌‌‌‌ పర్యటించారు. సింగరేణి స్కిల్​డెవలప్‌‌‌‌మెంట్‌‌‌‌ సెంటర్‌‌‌‌‌‌‌‌లో జర్మనీ లాంగ్వేజ్​ శిక్షణ పొందుతున్న యువతతో  ముచ్చటించారు. అనంతరం బీ-1 క్యాంపు​ఆఫీస్‌‌‌‌లో కలెక్టర్​ కుమార్​ దీపక్‌‌‌‌తో కలిసి అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. జర్మనీలో ఏడాదికి రూ. 25 లక్షల వరకు జీతం పొందే అవకాశం ఉందని, అభ్యర్థులు ఎంత త్వరగా భాషను నేర్చుకుంటే అంత త్వరగా ఉద్యోగాలు సాధించవచ్చని తెలిపారు. జర్మనీ, జపాన్​, సౌదీ దేశాల్లో 25 లక్షల ఉద్యోగాలు ఉన్నాయని చెప్పారు  తెలంగాణలో మొదటి స్కిల్​ డెవలప్‌‌‌‌మెంట్​ సెంటర్‌‌‌‌‌‌‌‌ను మందమర్రిలో ఏర్పాటు చేశామన్నారు. స్కిల్​ డెవలప్‌‌‌‌మెంట్‌‌‌‌కు సంబంధించి కేంద్రం ఇతర రాష్ట్రాల్లో ఒక్కో క్లస్టర్‌‌‌‌‌‌‌‌ కేటాయిస్తే.. తెలంగాణకు మాత్రం 4 క్లస్టర్లను ఇచ్చిందన్నారు. ఒక్కొక్క క్లస్టర్‌‌‌‌‌‌‌‌కు రెండు వందల కోట్ల చొప్పున తెలంగాణకు రూ.800 కోట్లు కేటాయించిందని వెల్లడించారు.   

మీ పార్టీ ఖాతాలోకి వందల కోట్లు ఎలా వచ్చాయ్‌‌‌‌?

బీఆర్ఎస్​ పార్టీ ఖాతాలో రూ.1,400 కోట్ల నిధులు ఎలా వచ్చాయో కేటీఆర్​ సమాధానం చెప్పాలని మంత్రి వివేక్​ వెంకటస్వామి డిమాండ్​ చేశారు. ఈ ప్రశ్నను కేటీఆర్​ సోదరి కవితే లేవనెత్తారని గుర్తుచేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌కు ప్రజలు విరాళాలు ఇచ్చారని, కానీ ఇప్పుడు వందల కోట్లు వచ్చాయని ఆరోపించారు. ఎలక్ట్రోరల్​ బాండ్ల పేరుతో ప్రజల సొమ్మును దోచుకున్నారన్నారు.

కేబినెట్ ఆమోదం లేకుండానే కేటీఆర్ ​ఈ-ఫార్ములా రేస్​ కోసం రూ.50 కోట్ల ప్రభుత్వ నిధులను విదేశీ కంపెనీకి కేటాయించారని తెలిపారు. వర్షాలు రావద్దని బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్​ లీడర్లు పూజలు చేశారని పేర్కొన్నారు. కాగా, సింగరేణి సంస్థకు కేటాయించిన తాడిచర్ల బ్లాక్​-–2 గనికి, రామకృష్ణాపూర్​ ఓపెన్​కాస్ట్​ ఫేజ్​-2 గనికి అవసరమైన పర్యావరణ అనుమతులు త్వరలో మంజూరు కానున్నాయని తెలిపారు. పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణతో కలిసి ఇటీవల కేంద్ర పర్యావరణ, -అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేంద్రయాదవ్‌‌‌‌తోపాటు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్​రెడ్డిని కలిసి అనుమతుల కోసం విన్నవించామని, వారు సానుకూలంగా స్పందించారన్నారు. రెండేండ్లు తాము చేసిన పోరాటంతోనే సింగరేణికి కొత్త బొగ్గు బ్లాక్‌‌‌‌లు దక్కాయని పేర్కొన్నారు.