Mirai 2 : సైలెంట్‌గా మొదలైన తేజ సజ్జా ‘మిరాయ్ 2’ షూటింగ్... రంగంలోకి రానా, మంచు మనోజ్!

Mirai 2 : సైలెంట్‌గా మొదలైన తేజ సజ్జా ‘మిరాయ్ 2’ షూటింగ్... రంగంలోకి రానా, మంచు మనోజ్!

టాలీవుడ్ సూపర్ హీరో తేజ సజ్జా కథనాయకుడుగా, కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో గతేడాది వచ్చిన  చిత్రం‘మిరాయ్’.  అడ్వెంచరస్ అండ్ సైన్స్ ఫిక్షన్ ఎలిమెంట్స్‌తో ప్రేక్షకులను థ్రిల్ చేసింది. బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.150 కోట్ల గ్రాస్ వసూళ్ల సాధించి రికార్డు సృష్టించింది. ఇప్పుడు ఈ బ్లాక్‌బస్టర్ కాంబో అంతకంటే వందరెట్లు ఎక్కువ క్రేజ్, భారీ బడ్జెట్‌తో ‘మిరాయ్ 2’ కోసం రంగంలోకి దిగింది.

ఎలాంటి ముందస్తు హడావుడి లేకుండా, సైలెంట్‌గా ఈ సీక్వెల్ షూటింగ్ వైజాగ్‌లోని ఆర్‌కే బీచ్‌లో ఈరోజే ( మే 19, 2026 ) మెరుపువేగంతో ప్రారంభమైంది. వైజాగ్‌ అందాల నేపథ్యంలో దాదాపు 10 రోజుల పాటు ఇక్కడ కీలకమైన యాక్షన్, డ్రామా సీన్లను చిత్రీకరించనున్నారు. పార్ట్-1 సక్సెస్‌తో వచ్చిన ఫుల్ జోష్‌లో, స్క్రిప్ట్ వర్క్ అంతా ముందే లాక్ అవ్వడంతో చిత్ర యూనిట్ ఆలస్యం చేయకుండా కెమెరా ముందుకు వచ్చేసింది.

►ALSO READ | సీఎం విజయ్ క్యాబినెట్‌లో ఫిల్మ్ శాఖ వివాదం.. విశాల్ కౌంటర్‌కి రాఘవ లారెన్స్ గట్టి రిప్లై!

ఈ సీక్వెల్‌లో అసలైన కిక్ ఏంటంటే... టాలీవుడ్ భల్లాలదేవుడు రానా దగ్గుబాటి ఇందులో పవర్‌ఫుల్ విలన్‌గా నటిస్తుండటం. తేజ సజ్జా మార్క్ హీరోయిజానికి, రానా ఊరమాస్ విలనిజం తోడైతే థియేటర్లు దద్దరిల్లడం ఖాయం. దీనికి తోడు రాక్‌స్టార్ మంచు మనోజ్ కూడా ఈ పార్ట్‌లో కీలక పాత్రలో మెరవబోతున్నట్లు టాక్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై అత్యున్నత సాంకేతిక విలువల, విజువల్ ఎఫెక్ట్స్‌తో ఈ సినిమాను విజువల్ వండర్‌గా నిర్మిస్తున్నారు.

మరో క్రేజీ అప్‌డేట్ ఏంటంటే... తేజ సజ్జా తన కెరీర్‌ను పూర్తిగా ఫ్రాంచైజీల వైపు మలిచాడు. వాస్తవానికి ‘జాంబీ రెడ్డి 2’ ముందుగా స్టార్ట్ అవ్వాల్సి ఉన్నా, ప్రీ-ప్రొడక్షన్ పనుల ఆలస్యం వల్ల ‘మిరాయ్ 2’ను లైన్‌లోకి తెచ్చాడు. దీని తర్వాత వెంటనే ‘జాంబీ రెడ్డి 2’ కూడా సెట్స్‌పైకి వెళ్లనుంది. ప్రస్తుతం ఇండియన్ సినిమాను సీక్వెల్స్ రూల్ చేస్తున్న తరుణంలో, ‘మిరాయ్ 2’ అంతకుమించిన గూస్‌బంప్స్ ఇవ్వడం గ్యారెంటీ అని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరి ఈ అడ్వెంచరస్ రైడ్ గురించి మేకర్స్ త్వరలోనే అధికారిక ప్రకటన చేయనున్నారు.