దుబాయ్: ఇండియా విమెన్స్ టీమ్ కెప్టెన్ మిథాలీ రాజ్ ఐసీసీ వన్డే బ్యాటర్స్ ర్యాంకింగ్స్‌లో ఒక ప్లేస్ మెరుగై రెండో ర్యాంక్‌కు చేరుకుంది. మంగళవారం రిలీజైన లేటెస్ట్ లిస్ట్‌లో మిథాలీ ఖాతాలో 738 రేటింగ్ పాయింట్స్ ఉండగా.. 750 పాయింట్లతో ఆస్ట్రేలియా క్రికెటర్ అలీసా హీలీ టాప్ ర్యాంక్‌లో కొనసాగుతోంది. స్మృతి మంధాన (710) ఆరో ర్యాంక్‌లో మార్పు లేదు. బౌలర్లలో జులన్ గోస్వామి తన రెండో ర్యాంక్‌ను నిలబెట్టుకుంది.

